“జనం ఆరోగ్యమే – జగన్ అన్న ఆశయం”
పేదలందరికీ న్యాయమైన వైద్యం అందించడమే లక్ష్యం.
YSR Aarogya Sri Card Status & Download
Note :పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని మీ ఆరోగ్య శ్రీ కార్డు యొక్క స్టేటస్ మరియు కార్డు ని డౌన్లోడ్ చేసుకో గలరు.
అర్హతలు :
బియ్యం కార్డు, పింఛన్ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న దీవెన పథకాలకు అర్హులైన వారు( YSR Aarogya Sri Scheme )ఈ పథకానికి అర్హులు.
మా గాని భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/ మెరక భూమి 35 ఎకరాలు లేదా మరియు మా గాని కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు అర్హులు.
5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన వారు అర్హులు.
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి/ పింఛనుదారులు మినహాయించి మరి ఇతర ఉద్యోగి ప్రభుత్వంలో గానీ లేదా ప్రైవేటుగా కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్- టైం ఉద్యోగులు, శానిటరీ వర్క్, గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షికాదాయం కలిగియున్న వారు అర్హులు.
3000 చదరపు అడుగుల (334.Sq.Yds)స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు.
ఒక కుటుంబానికి/ గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం :
అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, ఆస్తి పన్ను రుజువు, పట్టాదార్ పాస్ పుస్తకం నకలు, స్వీయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికెట్ ( ఏదైనా ఉంటే), వాహనాలు మరియు ఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటోతో పాటు స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయాల్లో గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR(Your Service Request – మీ సేవ అ అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది .
దరఖాస్తు చేసిన 20 రోజుల్లో అర్హులైన దరఖాస్తుదారునికి డా. వై. ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది.
Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.