Aadhar Card Address Change – How To Change Address In Aadhar Card Online 

Join Now


WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ పేజీలో మనము ఆధార్ గురించి మరియు ఆధార్ లో అడ్రస్ [ Aadhar Card Address Change ] ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. ఆధార్ కార్డు అనేది  ఒక వ్యక్తి యొక్క ఉనికిని చాటి చెబుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఏ వ్యక్తి అయినా  నివసించి ఉన్నాడు అంటే దానికి కారణం ఆ వ్యక్తికి ఆధార్ కార్డు ఉందని అర్థం. ప్రస్తుతం మనము ఆన్లైన్ కు సంబంధించి ఏ ఒక్క వర్క్ జరగాలన్న మన ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఈ ఆధార్ లో ప్రస్తుతం మనము మన అడ్రస్ [Aadhar Card Address Change] ని మార్చుకునే దానికి గవర్నమెంట్ అవకాశం ఇవ్వడం జరిగింది.

What Are The Documents Required For Aadhar Card Address Change?

UIDAI ప్రస్తుతం ఆన్లైన్లో ఆధార్ అడ్రస్ {Aadhar Card Address Change} చేంజ్ చేసుకోవడం ప్రాసెస్ ను చాలా సులభతరం చేయడం జరిగింది.. దాదాపుగా మనము 28 రకాల డాక్యుమెంట్స్ లలో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చి  ఆన్లైన్లో సింపుల్గా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చును

  • Passport (of self/spouse/parents in case of a minor)
  • Bank statement (Passbook, Post Office Account Statement)
  • Ration card
  • Voter ID
  • Driving License
  • Pensioner Card
  • Disability Card
  • CGHS/ECHS/ESIC/Medi-Claim Card with Photo issued by State/Central Govt/PSUs
  • Electricity Bills (not older than three months), including prepaid receipts 
  • Water Bill (not older than three months) 
  • Telephone Landline Bill/ Phone (Postpaid Mobile) Bill/ Broadband Bill (not older than three months)
  • Insurance Policy (Life & Medical only) 
  • Property Tax Receipt (not older than one year)

పైనున్న ఏదో ఒక డాక్యుమెంట్ ని మీరు సబ్మిట్ చేసి ఆన్లైన్లో  మీ ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చును.

Step-by-step Guide On How To Update Address In Aadhaar

ఈ రోజు మనము ఆన్లైన్లో ఏ విధంగా  ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలో చూద్దాం. ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లో మీరే మీ ఆధార్ కార్డుకి అడ్రస్ చేంజ్ చేసుకోండి.

Step 1 :- ముందుగా మీరు ఈ  క్రింద ఇవ్వబడిన లింకులు క్లిక్ చేయాలి.

Step 2 :- పైన ఉన్న లింకు క్లిక్ చేయగానే మీకు ఒక లాగిన్ పేజీ కనబడుతుంది.  అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్,  CAPTCHA  ఎంటర్ చేసి మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ కి ఓటిపి అనేది ఎంటర్ చేయాలి.

Step 3 :- లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజీ కనబడుతుంది.

Step 4 :-  తర్వాత Name/ Gender/ Date of Birth & Adress Update  అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 :-  క్లిక్ చేసిన తర్వాత Adress అప్డేట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. Update Adress Online  ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

Step 6 :- క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా మీకు instructions ఓపెన్ అవుతాయి. మీరు మొత్తం అనలేదు చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఆధార్ బటన్ పై క్లిక్ చేయాలి.

Step 7 :- ఆ తర్వాత స్క్రీన్ లో మీరు అడ్రస్ ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకోండి.

Step 8 :- Adress ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత Proceed to Update Aadhar పైన క్లిక్ చేయండి.

Step 9 :- క్లిక్ చేసిన తర్వాత మీ ప్రస్తుతం ఉన్న Adress చూపిస్తుంది.

Step 10 :- తర్వాత మీరు ఏదైతే అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి.

Step 11 :- తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి.

Step 12 :- మీరు సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ pdf file అప్లోడ్ చేయండి.

గమనిక :: కొత్త జిల్లాలకు సంబంధించి మీరు ఈ కింది డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్టయితే అప్డేట్ చేయొచ్చు.

  • వాటర్ బిల్
  • బ్యాంక్ స్టేట్మెంట్
  • కరెంట్ బిల్
  • పాస్పోర్ట్ గ్యాస్ కనెక్షన్
  • హౌస్ టాక్స్
  • Adress Certificate From Sachiylam

….. పైనున్న వాటిలో ఏదో ఒక దానిని మీరు ఇవ్వొచ్చు. ఇచ్చి మీరు అప్లోడ్ బటన్ పై సబ్మిట్ చేయండి.

Also Read..

💬 India Post Recruitment 2023 👉 :: Click Here

💬 How to Check PAN and Aadhaar Linking Status 👉 :: Click Here

💬 Sukanya Samriddhi Yojana Scheme clear information 2022 👉 :: Click Here

Step 13 :- డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక మీ యొక్క కొత్త అడ్రస్ పూర్తి వివరాలు కనిపిస్తాయి.. ఒకసారి డీటెయిల్స్ పూర్తిగా చూసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 14 :- తరువాత పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆధార్ అడ్రస్ మార్చినందుకు 50 రుపీస్ అమౌంట్ పే చేసి సబ్మిట్ చేయండి.

Step 15 :- మీ పేమెంట్ ఎంత పూర్తయిపోయిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా వస్తుంది. అందులో ఉన్న నెంబర్ మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది.

Aadhar Card Address Change Process Demo Video

ఈ క్రింద ఉన్న లింకును క్లిక్ చేసుకుని ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలో వీడియో రూపంలో తెలుసుకోండి.

Aadhar and Pan Card All Useful Links :: CLICK HERE

✍️ ఆధార్ లో చిరునామా అప్డేట్ సమాచారం :

ఆధార్ అడ్రస్ [ Aadhar Card Address Change ] ప్రూఫ్ సంబంధించి మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో మీరు అడ్రస్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఆ సర్టిఫికెట్ ని తీసుకొని ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మీరే పైనున్న ప్రాసెస్ అంతా ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చు.

✤ మీ ఆధార్ లో చిరునామా మార్పుకు ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రాల్లో / గ్రామ వార్డు సచివాలయాల్లో తో పాటుగా ఆన్లైన్ లో కూడా ఆప్షన్ కలదు.

✤ ఆధార్ లో చిరునామా మార్పుకు సపోర్టింగ్ డాక్యుమెంట్ అవసరం ఉంటుంది. ఏ డాక్యుమెంట్ లేని వారికి Address Certificate ఉంటే సరిపోతుంది. ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు.

✤ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు.

✤ మీరు ఆధార్ అడ్రస్ ప్రూఫ్ కి క్రింది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Application Form :: click here

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now