Best Post Office Saving Schemes For Child Boy

Join Now


Best Post Office Saving Schemes For Child Boy

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Best Post Office Saving Schemes For Child Boy

Best Post Office Saving Schemes For Child Boy – 2023 : పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు అనేక ఆస్తులు కొనుగోలు చేస్తారు. కానీ ఆస్తులనేవి ఏదో ఒకరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకొరకు పోస్ట్ ఆఫీస్ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా అబ్బాయిలకు కూడా కొన్ని మంచి పథకాలు అందిస్తుంది. వాటిని తీసుకోవడం భవిష్యత్ కాలంలో వారి చదువు కొరకు చాలా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత కాలం ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ల పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో మరియు కాలేజీలను లేదా విదేశాలలో చదివించడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ సమయంలో తగిన డబ్బు కోసం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాంటి సమస్యలు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారని గమనించిన పోస్ట్ ఆఫీస్ యాజమాన్యం అమ్మాయిలకి కాకుండా అబ్బాయిల కోసం కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాలు పూర్తిగా తెలుసుకున్నట్లయితే తల్లిదండ్రులు వారి పిల్లలను చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయా పథకాలలో పొదుపు చేసినట్లయితే పిల్లలు ఎదిగే సమయానికి వారికి అనేక రకాలుగ ఉపయోగపడతాయి.

మగ పిల్లలకు వర్తించే 5 పోస్ట్ ఆఫీస్ పథకాలు క్రింద చూడవచ్చు.

1. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ |

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అనగా తల్లిదండ్రులు 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కొంత నీకు ఇష్టం మొత్తాన్ని ఆదా చేయడం. బ్యాంకుల వలె ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకం కూడా పనిచేస్తుంది కాకపోతే బ్యాంకులతో పోలిస్తే ఈ పథకంలో పొదుపు చేసినట్లయితే అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ పథకం చాలా ప్రాముఖ్యత పొందింది దాని ద్వారా అనేకమంది పథకంలో పొదుపు చేయడానికి ఇష్టపడుతున్నారు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం యొక్క ఉపయోగాలు :

  • ముఖ్యంగా ఈ పథకం యొక్క కాల వ్యవధి 5 సంవత్సరాలు . లాక్ ఇన్ పీరియడ్ 3 నెలలు గా ఉంది.
  • ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయవచ్చు.
  • ఈ పథకం యొక్క కనీస పెట్టుబడి సొమ్ము రూ . 100 గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.
  • నామిని నీ జోడించడానికి ఈ పథకం అనుమతిస్తుంది.
  • ఈ పథకం ద్వారా ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ఈ పొదుపు పథకం నుండి మీ పొదుపు పథకానికి సులువుగా నిధులను బదిలీ చేయవచ్చు.
  • ప్రస్తుతానికి ఈ పథకం యొక్క పొదుపు రేటు సంవత్సరానికి 5.8 % గా ఉంది.

2. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ |

కిసాన్ వికాస్ పత్ర పథకం అనేది కేవలం అబ్బాయిల కోసం ప్రవేశపెట్టారు . ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు పిల్లల చిన్నప్పుడే కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి . ఒకవేళ 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రులు హామీగా ఉండి పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.

కిసాన్ వికాస్ పత్ర పథకం యొక్క ఉపయోగాలు :

  • ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే కనీస పెట్టుబడి 1000 నుండి ఆపై ఎంతైనా పెట్టవచ్చు.
  • 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • 18 సంవత్సరాల నిండలేనిచో తన తరుపున వారి తల్లిదండ్రులు సభ్యులు గా ఉండీ పథకానికి అప్లై చేయవచ్చు .
  • కిసాన్ వికాస్ పత్ర పథకం యొక్క సర్టిఫికెట్ ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ ఆఫీస్ కు బదిలీ చేసుకోవచ్చు.
  • ప్రస్తుతం ఈ పథకం యొక్క వడ్డీ రేటు 7.9 ℅ గా ఉంది.
  • అత్యవసర పరిస్థితులలో ఈ పొదుపు పెట్టిన నిధులను ముందుగానే ఉపసంహారించుకోవచ్చు.
  • ఈ పథకం యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 10 సంవత్సరాల 4 నెలలు .

3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ |

ఈ పథకం ముఖ్యంగా పన్నులను ఆదా చేయడానికి రూపొందించిన పథకంగా చెప్పవచ్చు . ఈ పథకంలో నామినేషన్ సదుపాయం కలదు. ఇది తక్కువ రిస్క్ ఉన్న పథకం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ యొక్క ఉపయోగాలు :

  • ఈ పథకం మైనర్ పేరుతో అకౌంట్ తెలిచి పెద్దలు నిర్వహించాలి.
  • ఈ పథకంలో కనీస పెట్టుబడి 500 నుండి గరిష్ట పెట్టుబడి 1.5 లక్షల వరకు అవకాశం ఉంది.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఈ పథకం ద్వారా చేసిన పెట్టుబడుల పై రూ 1.5 లక్షల పన్ను ప్రయోజనాలను కూడా ఈ PPF స్కీం అనుమతిస్తుంది.
  • 2023 జూన్ నాటికి ఈ పథకం యొక్క వడ్డీ రేటు 7.1 % గా ఉంది.ఈ పథకం లో PPF సంవత్సరాల లాక్ ఇన్ పదవి కాలంతో ఉంది.మూడవ సంవత్సరంలో ప్రారంభమయ్యే ఆస్తుల పై రుణాలు తీసుకోవడానికి ఈ పథకం అనుమతిస్తుంది.
  • ఈ స్కీం ద్వారా తల్లిదండ్రులు కాల వ్యవధిని 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు

4 . పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పాలసి |

ఆఫీస్ మగపిల్లల కోసంప్రవేశపెట్టిన పథకాలలో ఇది ఒక్కటి . ఈ పథకం స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.ఇది మంత్లీ ఇన్కమ్ స్క్రీన్ గా చెప్పవచ్చు రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పాలసి :

  • ఈ పథకం యొక్క కనీస పెట్టుబడి 1000 గరిష్టంగా 4.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు.
  • మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు . పెట్టుబడి పై హామీతో కూడిన రాబడిని అనుమతిస్తుంది.
  • 2023 జూన్ నాటికి ఈ పథకం యొక్క వడ్డీ రేటు 7.40 % గా ఉంది.నెలసరిగా ఈ పథకంలో వడ్డీ చెల్లింపులు ఉంటాయి.
  • ఈ పథకంలో TDS వర్తించదు. కాని పెట్టిన పెట్టుబడి మొత్తం సెక్షన్ 80 C క్రింద కవర్ చేయబడుతుంది.
  • ఈ పథకంలో మెచ్యూరిటీ వరకు మూలధన రక్షణ అందిస్తుంది.

5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ NSC |

ఇది తక్కువ రిస్క్ మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న పథకం. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం అనేది . చిన్న మరియు పెద్ద ఆదాయం పెట్టుబడి దారులను ప్రోత్సహించడానికి తీసుకురావడం జరిగింది. ఇది పన్ను ప్రయోజనాలను పొదుపు చేస్తుంది . ఈ పథకం యొక్క ముఖ్య ఉపయోగాలను క్రింద చూడవచ్చు .

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ యొక్క ఉపయోగాలు :

  • ఈ పథకం యొక్క కనీస పెట్టుబడి 1000 గరిష్ట పెట్టుబడి అపరిమితం .
  • ప్రభుత్వం ఈ పథకం యొక్క వడ్డీ రేట్లు ప్రతి సంవత్సరం మార్చుతుంది .
  • ఈ పథకం యొక్క ప్రస్తుత వడ్డీ రేటు 7.7 % గా ఉంది.
  • ఈ పథకం ద్వారా 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లైమ్ చేసుకోవచ్చు.
  • ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాల వ్యవధి 5 సంవత్సరాలు . లాక్ ఇన్ టెన్యూర్ 5 సంవత్సరాలు గా ఉంది.
  • తక్కువ వయసు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ పథకానికి అప్లై చేసే అవకాశం కలదు.

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

READ MORE :-

  1. How Volunteer ls take Ayushman eKYC? – 2023 Full Process
  2. How To Download 1B Online- 2023 Full Process
  3. How To Check Aadhar History Full Process Online -2023
  4. SSC Marks Memo Download Online 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now