ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ – Distribution of HCM 2 Page Latters By Volunteers

Join Now


Distribution of HCM Two Page Latters By Volunteers

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Distribution of HCM 2 Page Latters By Volunteers

2 Page Letter Distribution Survey – ప్రతి ఇంటికి 2 పేజీలో లేఖ పంపిణీ సర్వే

Distribution of HCM 2 Page Latters By Volunteers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు ఉంటాయి.

  • వాలంటీర్లు & సెక్రెటరీ లు ప్రతి ఇంటిని సందర్శించి, 2 పేజీల లేఖలను సంబంధిత ఇంటికి అందజేసి, వారికి అందిన ప్రయోజనాలను వివరిస్తారు.
  • తరువాత వాలంటీర్లు గృహ అధికారి తో BOP యాప్ నందు eKYC తీసుకుంటారు. (యూజర్ మాన్యువల్ & యాప్ త్వరలో అందించబడుతుంది).
  • ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు & సెక్రటరీలు 8 మార్చి 2024 నుండి 10 మార్చి 2024 మధ్య ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి.
  • వాలంటీర్లు కి ట్రైనింగ్ తేది మార్చి 6 & 7

Distribution of Two 2 Page Letter Timeline – రెండు పేజీల లెటర్ పంపిణి టైమ్ లైన్

  • 03 మార్చి 2024 : RDO వారి నుండి MPDO / MC వారు మెటీరియల్ తీసుకొనుట.
  • 07 మార్చి 2024 : MPDO / MC వారి నుండి సచివాలయాలకు మెటీరియల్ పంపించుట.
  • 06 మార్చి నుండి 07 మర్చి వరకు : వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చుట.
  • 08 మార్చి నుండి 10 మార్చి వరకు : వాలంటీర్లు ఇంటింటికి లెటర్లను పంపిణీ చేయుట.

గ్రామ వార్డ్ వాలంటీర్లు CM letter పంపిణీ బాధ్యతలు

  • సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి నుండి మెటీరియల్ తీసుకోవటం.
  • మార్చి 6 నుండి 7 లోపు సచివాలయం లొ జరిగే ట్రైనింగ్ కు హాజరు అగుట.
  • క్లస్టర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వారు అందుకున్న లబ్దిని తెలియజేస్తూ 2 పేజీ ల లెటర్ ను అందుంచాలి. ఇస్తునప్పుడే ఇంట్లో ఎవరో ఒకరి eKYC తీసుకోవాలి.
  • వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాటలాడుతూ పొందినటువంటి లబ్ది కోసం పూర్తిగా తెలియజేయాలి.
  • ప్రస్తుతం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.
  • మార్చ్ 8న సర్వే మొదలుపెట్టి మార్చి 10 లోపు సర్వేను పూర్తి చేయాలి.

పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) :

  • 1. MPDO / MC వారి నుండి మెటీరియల్ తీసుకోవాలి.
  • 2. BOP యాప్ లొ ఎన్ని లెటర్ లు తీసుకున్నారు నమోదు చేయాలి.
  • 3. వాలంటీర్ వారీగా మెటీరియల్ను సపరేట్ చేసి
  • 4. సంబంధిత వాలంటీర్లకు మెటీరియల్ అందజేయాలి.
  • 5. ప్రతి వాలంటీర్ కు సచివాలయ సిబ్బందితో ట్యాగ్గింగ్ చేయాలి.
  • 6. టైం లైన్ ప్రకారం పంపిణీ పూర్తి అయ్యేలా చూసుకోవాలి.

సచివాలయ సిబ్బంది :

  • 1. ట్యాగింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ మానిటరింగ్ చేయాలి.
  • 2. టైం లైన్ ప్రకారం త్యాగ్గింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయ్యేలా మరియు eKYC అన్నియు పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
  • 3. మైగ్రేషన్ మరియు డెత్ రిపోర్టులను సర్వే అయిన తర్వాత సిద్ధం చేసుకోవాలి.

Also Read This :-

WhatsApp Group Join Now
Telegram Group Join Now