ఈ పేజీలో మీకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ( Jagananna Videshi Vidya Deevena Scheme) పూర్తి డీటెయిల్స్ మరియు స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు జాయినింగ్ కోర్సులు విదేశీ విద్యా దీవెన పథకం కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇందులో అందించడం జరుగుతుంది.
JAGANANNA VIDESHI VIDYA DEEVENA SCHEME
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కు సంబంధించి 2022 జీవో రిలీజ్ చేసుకొని జీవో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Jagananna Videshi Vidya Deevena Scheme G.OClick
Jagananna Videshi Vidya Deevena Scheme వివరణ ::
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన ఉన్నత గల విద్యను అభ్యసించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చదువు కోసం ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విదేశీ దీవెన పథకం (Jagananna Videshi Vidya Deevena Scheme) అమలు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా వరల్డ్ లోనే First 200 University లో స్థానం సంపాదించిన వారికి గాను అయ్యే ఖర్చులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదటి 100 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు వర్తించనుంది.. 100-200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో రూ.50 లక్షల వరకూ ఫీజు రీయంబర్స్మెంటు వర్తించనుంది.
Jagananna Videshi Vidya Deevena Scheme ద్వారా ఏ ఏ కోర్సులలో జాయిన్ అవ్వచ్చు?
P.G , MBBS. PHD. గల కోర్సు పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ( Jagananna Videshi Vidya Deevena Scheme ) ద్వారా ఇతర దేశాలలో పేద విద్యార్థుల ఉన్నత చదువులు కోసం ఎంతో పారదర్శకంగా ఈ పథకాన్ని ప్రభుత్వ అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
విదేశీ విద్యా దీవెన పథకం అర్హతలు ::
జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కుటుంబ సంవత్సరం ఆదాయం 8 లక్షల కంటే తక్కువ గలవారు ఈ పథకం కింద ఫీజు రిమోర్స్మెంట్ అందించడం జరుగుతుంది.
TOP 200 University లలో స్థానం సంపాదించిన వారి అందరికీ విదేశీ విద్య దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు.
ఒక ఫ్యామిలీ లోని ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకానికి వర్తింపగలరు
ప్రతి సంవత్సరం September, December, January, May, కాలం నాటి అర్హత గుర్తించేందుకు మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఇప్పుడు తాత్కాలికంగా ఈ పథకం ఏ విధంగా కేటాయించారు
నిరుపేదల విద్యార్థులకు ఈ పథకం ద్వారా చదువును అభ్యసించడం కొరకు వీరికి ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
కుటుంబం యొక్క ఆదాయాన్ని 8 లక్షల లోపు వారికే కాకుండా వాటిని పెంచుతూ ఇంకొంతమందికి ఈ పథకం కింద మంచి చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
వరల్డ్ వైడ్ ఏ దేశంలో నైనా TOP 100 University లలో చదివించేటటువంటి విద్యార్థులకు ఈ పథకం ద్వారా వర్తింపు.
Top 100 University లలో స్థానం సాధించిన వారికి పూర్తిగా ఫీజు రివర్స్మెంట్ చెల్లిస్తారు. 101, 200 లోపల ఉండే ర్యాంకు గల యూనివర్సిటీలో స్థానం సంపాదించిన వారికి 50% తో 50 లక్షల రూపాయలు దాకా ఫీజు రిమోట్ ఏపీ ప్రభుత్వం అందిస్తుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెదీవెన పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని ఏ విధంగా విద్యార్థుల కు అందిస్తారు ?
నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రీయంబర్స్మెంటు విడుదల కానుంది. ల్యాండింగ్ పర్మిట్, ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు ఉంటుంది. మొదటి సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు చేస్తుంది. రెండో సెమిస్టర్ ఫిలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తుంది. నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. ఎపి స్థానికుడై ఉండి 35 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ప్రతిఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టి, మైనార్టీలకు రూ.15 లక్షలు, కాపు బిసిలకు రూ.10 లక్షల వరకూ ఫీజు రీయంబర్స్మెంటు వర్తించిందని పేర్కొంది. ఇప్పుడు టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయంబర్స్మెంటు వర్తించనుందని తెలిపింది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం దరఖాస్తు చేసుకునే విధానం ::
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా సంవత్సరం గా ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలోని యూనివర్సిటీలలో అలాగే ఏపీ ఎస్ కే డబ్ల్యు డి సి ఎల్, సైట్ లోనే విడుదల చేయడం జరుగుతుంది. Apskwdcl సైట్ ద్వారా వివరాలన్నీ ఎంటర్ చేసి క్రింద సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని స్కానింగ్ చేసి వాటి పిడిఎఫ్ లను అప్లోడ్ చేయవలెను.
✔ ఆధార్ కార్డు
✔ ఇన్కమ్ సర్టిఫికెట్
✔ క్యాస్ట్ సర్టిఫికెట్
✔ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ మార్కు లిస్ట్
✔ National Saving Bank Book
✔ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
✔ Gre, Gmat, మార్కుల మెమో
✔ Tofel, Lelts మార్కుల మెమో
✔ ఇతర దేశాల్లో యూనివర్సిటీలోని ప్రవేశాల కాల్ లెటర్
✔ విద్యార్థి యొక్క బయోడేటా
గమనిక :: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ పేజీలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. మళ్లీ కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు తప్పకుండా షేర్ చేయగలరు.