
మిషన్ వాత్సల్య స్కీమ్ [ Mission Vatsalya Scheme ] 18 సంవత్సరముల లోపు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లల కుటుంబాలు పిల్లలకు ఆర్థిక లేదా ఇతరత్రా అనగా పిల్లల వైద్య, విద్య మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి అనుబంధ మద్దతును అందించడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య [ Mission Vatsalya Scheme ] క్రింద స్పాన్సర్‌షిప్ ఇది షరతులతో కూడిన సహాయంగా అందించడం జరుగుతుంది. ఈ sponsorship ద్వారా పిల్లలకి నెలకు ఒక్కొకరికి రూ.4000/-లు అందించడం జరుగుతుంది.
ఆనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, తల్లిదండ్రులు దూరమైన వారు పాక్షిక అనాథలు (తల్లి లేక తండ్రిని కోల్పోయినవారు), విడాకులు పొందిన తల్లిదండ్రులు ఉన్నవారు, కుటుంబం వదిలేసిన, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పడినా, పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన, బాలల న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం-2015 ప్రకారం ఇల్లులేని పిల్లలకు ప్రకృతి వైపరీత్యానికి గురైన బాల కార్మికులు, అక్రమ రవాణా, దాడులకుగురైన బాలలు, బాల యాచకులు, బాల్య వివాహ, హెచ్ఐవీ బాధిత, పీడిత బాలలు, దివ్యాంగులకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా వారి అభివృద్ధికి ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పన ఆర్ధికసాయం అందించనున్నారు.
Annual Income Limit for Mission Vatsalya వార్షికాదాయం
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.96 వేలు మించ రాదు. జేజే బోర్డు, బాలల సంక్షేమ కమిటీ కోర్టు లిఖిత పూర్వకంగా నమోదు చేసిన కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టి స్పాన్సర్ షిప్ పొడిగించవచ్చు. స్పాన్సర్ షిప్ అందుకుంటున్న బాలలను ఏదైనా వసతి గృహం, బాల సదనంలో చేర్పించిన తర్వాత సహాయం నిలిపివేస్తారు.
Eligibility for Mission Vatsalya Scheme ఎవరు అర్హులు?

1. తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
2. పిల్లలు అనాథలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తువున్నవారు.
3. తల్లిదండ్రులు ప్రాణాపాయ/ప్రాణాంతక వ్యాధికి గురైన వారు.
4. తల్లిదండ్రులు ఆర్థికంగా మరియు శారీరకంగా అసమర్థులు అయివుండి పిల్లలను చూసుకోలేని వారు.
5. JJ Act,2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు అనగా, కుటుంబంతో లేని పిల్లలు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, బాల కార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, మిస్సింగ్ మరియు ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు లేదా వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, సహాయం మరియు పునరావాసం అవసరమయ్యే హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన లేదా దోపిడీకి గురైన పిల్లలు.
6. PM Cares for Children Scheme (కోవిడ్-19/కరొనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు) నందు నమోదు కాబడిన పిల్లలు.
Mission Vatsalya Sponcership యొక్క కాల పరిమితి :-
- జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా చిల్డ్రన్స్ కోర్ట్ లిఖితపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల ఆధారంగా స్పాన్సర్‌షిప్‌ను 18 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
- స్పాన్సర్‌షిప్ మద్దతు వ్యవధి మిషన్ వాత్సల్య కాలంతో సహ-టెర్మినస్‌గా ఉంటుంది. ఏ సమయంలోనైనా పిల్లవాడిని హాస్టలో కానీ, ఏదైనా బాలసదనంలో కానీ చేర్పించిన యెడల స్పాన్సర్‌షిప్ సహాయం నిలిపివేయబడుతుంది.
- ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విషయంలో మినహా పాఠశాలకు వెళ్లే పిల్లవాడు పాఠశాల హాజరులో 30 రోజులకు పైగా సక్రమంగా లేరని తేలితే, స్పాన్సర్‌షిప్ సహాయం సమీక్షించబడుతుంది మరియు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.
How to Apply Mission Vatsalya Scheme

Mission Vatsalya Scheme కి అర్హత కలిగిన పిల్లలు వున్న యెడల సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ పరిధిలోని మహిళా పోలీసు వారిని కలిసి దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరుచున్నాము.
Mission Vatsalya Apply Application Form :: Click Here
దరఖాస్తు చేయు సమయంలో ఏవైనా సందేహాలు ఉన్న యెడల జిల్లా బాలల పరిరక్షణ విభాగము సిబ్బందిని రెవెన్యూ డివిజన్ల వారిగా సంప్రదించవచ్చును.
బద్వేల్ రెవెన్యూ డివిజన్ – Smt.G. Sunitha, Protection Officer – 79015973463.
పులివెందుల రెవెన్యూ డివిజన్ – Sri.B.Vinod Kumar, Social Worker – 70130893644.
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ – Sri. G. Maheswara, Counsellor – 9948779114
గమనిక :: ప్రతి జిల్లాకు సంబంధించి పైన ఇవ్వబడిన అధికారి నెంబర్లు ఉంటాయి.. మీకు సంబంధించిన మీ జిల్లా అధికారుల నెంబర్లు లేదా మీ దగ్గరలోని గ్రామపంచాయతీ సచివాలయం కు వెళ్లి మహిళా పోలీసు వారిని సంప్రదించి Mission VatsalyaScheme కి దరఖాస్తు చేసుకోగలరు.
సంప్రదించాల్సిన కార్యాలయాలు
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం
Mission Vatsalya Scheme Apply Documents Process
ఈ ప్రభుత్వ పథకం గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న వీడియోని చూసి తెలుసుకోండి.
Mission Vatsalya Scheme Apply Documents & దరఖాస్తుకు జతచేయవలసిన పత్రాలు :
- బాలుడి/బాలిక జననధ్రువీకరణ పత్రం.
- అధార్ కార్డుతల్లి ఆధార్ కార్డుతండ్రి అధార్ కార్డు
- తల్లి, తండ్రి డెత్ సర్టిఫికెట్, మరణకారణంగార్డియన్ ఆధార్రేషన్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రంబాలుడు, బాలిక పాస్పోర్టు సైజు ఫొటోస్టడీ సర్టిఫికెట్ఆదాయ ధ్రువీకరణ పత్రంబ్యాంకు అకౌంట్ వివరాలు బాలుడు, లేదాబాలిక వ్యక్తిగత ఆకౌంట్ లేక తల్లి తండ్రి సంరక్షకులతో కలిసి జాయింట్ అకౌంట్.
Mission Vatsalya Scheme Full Details
విధి వంచితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ మేరకు ఎటువంటి ఆదరణ లేక అభాగ్యులుగా మిగిలిన పిల్లలకు చేయూత నిచ్చేందుకు చర్యలు చేపడుతోంది. వారి విద్య, వైద్య అవసరాలను తీర్చేందుకు ఆర్థిక చేయూత అందించనుంది. ఈ నేపథ్యంలో ‘మిషన్ వాత్సల్య ‘పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్షప్ కల్పిస్తున్నాయి. నిరాదరణ, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. జిల్లాలో ఉన్న అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు.
తల్లిదండ్రులు దూరమైన వారు పాక్షిక అనాథలు (తల్లి లేక తండ్రిని కోల్పోయినవారు), విడాకులు పొందిన తల్లిదండ్రులు ఉన్నవారు, కుటుంబం వదిలేసిన, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పడినా, పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన, లకు పైగా సక్రమంగా లేదని తేలినా పరిశీలించి బాలల న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం-2015 తాత్కాలికంగా నిలిపివేస్తారు.
గమనిక :: పైనున్న మంచి ఇన్ఫర్మేషన్ మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మీ భద్ర..
💬 India Post Recruitment 2023 👉 :: Click Here
💬 How to Check PAN and Aadhaar Linking Status 👉 :: Click Here
💬 Sukanya Samriddhi Yojana Scheme clear information 2022 👉 :: Click Here