
ఈ పేజీలో మీకు సదరం క్యాంపు కు (Sadaram Camp Details, Status, Delete Process) సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సదరం సర్టిఫికెట్ స్లాట్ ఆన్లైన్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి. ఎలా బుక్ చేసుకోవాలి, సర్టిఫికెట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే డిలీట్ ప్రాసెస్ ఎలా చేయాలి. సదరం క్యాంపుకు సంబంధించి పూర్తి వివరాలు పేజీలో మీకు ఈ పేజీలో అందించడం జరుగుతుంది.
Sadaram Camp Details, Status, Delete Process

📋 సదరం సర్టిఫికెట్ (వికలాంగుల సర్టిఫికెట్) : జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించి ముందస్తు సదరం స్లాట్ బుకింగ్ జూలై 4 (రేపటి) నుంచి ప్రారంభం.
ముందుగా వెయిటింగ్ లిస్ట్ లొ ఉన్న స్లాట్ కు సంబందించిన లబ్దిదారుల మొబైల్ నెంబర్ కు మెసేజ్ వెళ్తుంది. లేదా సదరం Acknowledgment లొ చెక్ చేసుకోవచ్చు.
☛ సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు
☛ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలోనూ సదరం సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పన.
🔰 FOR CANCEL OF OLD SADAREM ID For Cancel Of Old Sadarem Slot
☑️ Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old Sadarem ID.
☑️ Concern Hospital has to raise a grievance for Cancel Of ID/Slot @ Sadarem Portal.
☑️ Please do not send mail to sadarem helpdesk in this regard.
☑️ Pl Inform The Same To DA/WEDS
Sadaram All Link’s Status & Application & Dashboard
Sadaram Sloot Status Checking>Click Here
Sadaram Sloot Booking Application>Click Here
Sadaram Dashboard>Click Here
Sadaram Certificate (or) ID Delete Process
📜) ఓల్డ్ సర్టిఫికెట్స్ (2018 ఆగస్ట్ 2 కి ముందువి మ్యాన్యువల్ సర్టిఫికెట్స్) ఈ సర్టిఫికేట్స్ డిలీషన్ కి డైరెక్ట్ గా సదరం క్యాంప్ జరిగే హాస్పిటల్ నుండి గ్రీవెన్స్ పెట్టవచ్చు (గ్రివెన్స్ ఆప్షన్ సదరం సైట్ లో ఉంటుంది) సదరం డిపార్ట్మెంట్ ఐడీ స్టేటస్ చెక్ చేసి ఓల్ సర్టిఫికెట్ ఐతే గనక అప్రోవ్ ఇచ్చి డీలీట్ చేస్తుంది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
📜) టెంపరరీ సర్టిఫికెట్స్ డాక్టర్ గారు దివ్యాంగుడిని తనికీ చేసిన తరువాత భవిష్యత్ లో అతనికి తగ్గుతుంది అని అనిపిస్తే టెంపరరీ సర్టిఫికెట్స్ ఇవ్వబడును ఆ సర్టిఫికెట్స్ కాల పరిమితి ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఇవ్వబడును సర్టిఫికెట్ డేట్ ఎక్సపైరీ అయ్యిన తరువాత హాస్పిటల్ నుండి గ్రివెన్స్ పెట్టవచ్చును సదరం డిపార్ట్ మెంట్ ఐడీ స్టేటస్ చెక్ చేసి డేట్ ఎక్సపైరీ ఐతే గనక వెంటనే అప్ప్రొవ్ ఇస్తుంది వారు తిరిగి మరలా స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
📜) డైరెక్ట్ రిజెక్ట్ కేస్ , అస్సెస్సేడ్ అండ్ రిజెక్ట్డ్ కేస్డాక్టర్ గారు దివ్యాంగుడిని తనికీ చేసిన తరువాత తనకి ఉన్న వైకల్య శాతం ని నమోదు చేస్తారు దాన్ని బట్టి ఆ సర్టిఫికెట్ పర్మినెంట్ ఆ లేక అస్సెస్మెంట్ జరిగి రిజెక్ట్ అయ్యిన కేస్ ఆ అనేది తెలుస్తుంది. 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే అది పర్మినెంట్ సర్టిఫికెట్ పెంక్షన్ కి ఎలిజిబుల్ అవ్వుతుంది.వైకల్య శాతం 40% కంటే తక్కువ ఉంటే గనుక అట్టి సర్టిఫికెట్ రిజెక్ట్ అయ్యిన కేస్ అని అర్థం చేసుకోవాలి ఈ వైకల్య శాతం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇస్తున్నారన్నది గుర్తుంచుకోవాలి.అలాగే వైకల్య శాతం అనేది 40% కంటే ఎక్కువ ఉండి ఆ సదరం ఐడీ టెంపరరీ సర్టిఫికెట్ ఐతే గనక వారు పెంక్షన్ కీ ఎలిజిబుల్ కారు.
📜) అసెస్మెంట్ జరిగి రిజెక్ట్ అయ్యిన కేస్ లు (40 % కంటే తక్కువ పెర్సెంటేజ్ వచ్చిన వాళ్లు) , టెంపరరీ సర్టిఫికెట్స్ వాళ్ళు మరల తనికీకి అవకాసం పొందాలంటే వారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందనా కార్యక్రమాలు జరుగును అక్కడ వాళ్ళు అర్జీ ఇస్తే అక్కడ ఉన్న అధికారులు జిల్లాలోని ఏదో ఒక హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు , అర్జీ ఇచ్చిన దివ్యాంగుడు ఆ హాస్పిటల్ కి వెళ్లి సంబంధిత డాక్టర్ గారి దగ్గర ఒపి మీద తిరిగి తనికీకి వెళ్ళాలి డాక్టర్ గారు వారిని తనికీ చేసి వాళ్ళు గనక ఎలిజిబుల్ అయ్యితే గనుక ఆ ఒపి మీద ఇట్ ఈస్ ఫిట్ ఫర్ రీ అస్సెస్మెంట్ లేదా ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ రీ అసెస్మెంట్ అని వ్రాయాలి , లేదు వారు ఎలిజిబుల్ కారు మరలా తనికీ చేసిన అని డాక్టర్ గారికి అనిపిస్తే వెంటనే వారికి మీరు అర్హులు కారు సదరం రూల్స్ ప్రకారం అని చెప్పి వెనక్కి పంపవచ్చును.ఎలిజిబుల్ అని డాక్టర్ గారు ఒపి మీద రాస్తే గనుక అట్టి డాక్టర్ గారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గార్కి ఒక లెటర్ వ్రాయాలి సదరు దివ్యాంగుడికి రీ అసెస్మెంట్ కి అవకాశం ఇవ్వమని….పై చెప్పిన అన్ని డాక్యుమెంట్లు ఉంటే గనక అట్టి సదరం ఐడీ కి రీ అసెస్మెంట్ కి అవకం ఇవ్వటం జరుగుతుంది.ఏ సర్టిఫికేట్ కైనా రీ అసెస్మెంట్ ఇవ్వాలి అంటే సదరం మెయిల్ కి పంపవల్సిన డాక్యుమెంట్స్ a) స్పందనా అర్జీb) డాక్టర్ OPc) డాక్టర్ గారు కమిషనర్ గార్కి వ్రాసిన లెటర్ఈ మూడు కలిపి sadaremapvvp@yahoo.com కి మెయిల్ చేసిన యెడల అట్టి ఐడీ కి తిరిగి తనికీకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
📜 ) ఏ ఐడీ ఐనా గ్రివెన్స్ సదరం సైట్ లో 2 సార్లు మాత్రమే పెట్టగలం రెండు సార్లు గ్రివెన్స్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తే గనక ఆ ఐడీ ని మూడవ సారి గ్రీవెన్స్ పెట్టటం కుదరదు మూడోసారి గ్రివెన్స్ పెట్టటానికి ప్రయత్నించిన ఎర్రర్ 500 అనే మెసేజ్ చూపిస్తుంది.
📝 పైనున్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవ్వగలరు ధన్యవాదములు.