Tdp Kutami Manifesto : కూటమి మేనిఫెస్టో 2024

Join Now


Tdp Kutami Manifesto : కూటమి మేనిఫెస్టో - 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tdp Kutami Manifesto : కూటమి మేనిఫెస్టో 2024

Tdp Kutami Manifesto : కూటమి మేనిఫెస్టో: ఆంధ్రప్రదేశ్‌లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ తాజా మేనిఫెస్టోలను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఎపీ ఎన్నికల ఫలితాల వల్ల వైరల్ అవుతోంది. టీడీపీ నాయకుడు చంద్రబాబు “సూపర్ సిక్స్” హామీలను ఇందులో చేర్చారు. అలాగే, జనసేన పార్టీ సూచించిన “షన్ముఖ వ్యూహం” పథకాలు మరియు హామీలను కూడా ఇందులో చేర్చారు. ఈ విధంగా అన్ని అంశాలను కలిపి ఈ మేనిఫెస్టోను విస్తృతంగా రూపొందించారు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన ముఖ్య హామీలు

మెగా డీఎస్సీపై నైతిక ప్రశ్నాల వలన నిరుద్యోగులకు మేలు చేయాలని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ. 3 వేలు నుండి రూ. 4 వేలకు పెంచుతామని, మరియు ఈ ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ రూ. 3 వేలు తీసుకున్నారు, మిగిలిన రూ. 1000 బకాయిలను మూడు నెలలకు రూ. 3 వేలు కలిపి జూలై నెలలో కొత్త పెన్షన్తో మొత్తం రూ. 7 వేలు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6 వేలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. వీటితో పాటు ఇతర వర్గాలకు మేలు చేసే కొత్త హామీలను కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

Also Read This :-

Thalliki Vandanam Scheme 2024

ఇవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు

  • మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
  • వృద్ధాప్య పెన్షన్ 4000/-
  • దివ్యాంగుల పెన్షన్ 6000/-
  • 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500/-
  • ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం
  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు
  • నిరుద్యోగులకు నెలకి 3000/- నిరుద్యోగ భృతి
  • తల్లి వందనం కింద ఎంత మంది బిడ్డలు ఉన్న ఏడాదికి ఒక్కో బిడ్డకి 15000/-
  • ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
  • ప్రతి రైతుకు ఏడాదికి 20000/- పెట్టుబడి
  • వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000/-
  • ఉచిత ఇసుక
  • పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు
  • భూహక్కు చట్టం రద్దు
  • ప్రతి ఇంటికి రుచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు
  • బీసీ రక్షణ చట్టం
  • “పూర్ టూ రిచ్” ద్వారా ప్రతి పేదవాడినీ సంపన్నులను చేయడం
  • చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్
  • కరెంటు చార్జీలు పెరగవు
  • బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది
  • ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇళ్ల స్థలం
  • ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇల్లు నిర్మాణం
  • పెళ్లి కనుక కింద 1,00,000/-
  • విదేశీ విద్య మళ్ళీ వస్తుంది
  • పండుగ కానుకలు మళ్లీ వస్తాయి

Tdp Kutami Manifesto 2024 : కూటమి మేనిఫెస్టో

2024 సంవత్సరానికి సంబంధించిన TDP, JSP, BJP Manifesto PDF :- CLICK HERE

కూటమి మేనిఫెస్టోకు సంబంధించి మీరు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్‌ను క్లిక్ చేసి Tdp Kutami Manifesto పూర్తి వివరాలు చూడండి. 👇👇👇

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ [ Tdp Kutami Manifesto ] మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Read More : Tdp Kutami Manifesto : కూటమి మేనిఫెస్టో 2024
WhatsApp Group Join Now
Telegram Group Join Now