
ఈ పేజీలో నేను మీకు వైఎస్ఆర్ బీమా కు సంబంధించి సర్వే ఎలా చేయాలి, అలాగే కొత్తగా ఏదైనా బీమా యాప్ { YSR Bima Renewal App Download & Survey Process } వస్తే ఈ పేజీలో ఆటోమాటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది.
💥 వైస్సార్ భీమా అప్డేట్
👉🏽 ప్రస్తుత పాలసీ 30-06-2022 తో ముగియును కాబట్టి ఈ నెలలో రెన్యూవల్ చేయాల్సి ఉన్నది. 👉🏽 రేపటి నుండి YSR భీమా కొత్త ఎంరోల్మెంట్, రెన్యూల్స్ చేయడానికి రేపు ఉదయం APP మరియు SOP విడుదల చేస్తున్నారు. 👉🏽 వాలంటీర్స్ అందరు ఈ వైస్సార్ భీమా క్రొత్తగా ఎంరోల్మెంట్ మరియు రెన్యువల్ మరియు మొత్తం కుటుంబాలను కవర్ చేయాలని అందరు WEA మరియు WDS లు వాలంటీర్స్ చేసిన వర్క్ ని 15% to 20% డేటా ను random గా వెరిఫై చేయాలి. 👉🏽 కావునా అందరు WEA లు మరియు WDS లు ఈ విషయమును మీ పరిధి లోవున్న వాలంటీర్స్ కు తెలియచేసి ఈ వర్క్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 10 రోజులలో పూర్తి చేయవలసిందిగా అదేశములు జారీ చేసియున్నారు.
YSR Bima Renewal App Download & Survey Process
ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ బీమా కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రింది లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
NOTE :: YSR BHIMA RENEWAL APP DOWNLOAD పైనున్న లింకుని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
YSR Bima Renewal App Survey Process
ఈ క్రింది పేజీలో వీడియో రూపంలో ఎలా బీమా సర్వే చేయాలి, అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన పిడిఎఫ్ రూపంలో ఎలా బీమా చేయాలి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకోండి.
Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.
Regarding YSR Bima
👉 మీ సచివాలయ పరిధిలో ఉన్న అర్హత కలిగిన అందరూ లబ్ధిదారులను బీమా లో నమోదు అయ్యే విధంగా చూడండి.
👉 గత సంవత్సరం బీమా లో ఉన్న వ్యక్తిని కంటిన్యూ చేస్తున్నట్లయితే లబ్ధిదారుని బయోమెట్రిక్ అవసరం లేదు.
👉 లబ్దిదారుని మార్పు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవలెను.
👉 నామిని మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
👉 నామిని యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అందుబాటులో ఉంటే నమోదు చేయండి లేకపోతే నో అకౌంట్ అని సబ్మిట్ చేయవచ్చు.
👉 సింగిల్ పర్సన్ ఉన్న రైస్ కార్డు విషయంలో నామిని వారికి ఇష్టమైన వారిని నమోదు చేయవచ్చు.
👉 కానీ నామినీగా అతనిని ఎందుకు నమోదు చేయవలసి వచ్చిందో ఖచ్చితంగా అఫిడవిట్ ఉండాలి. (ఇప్పుడు కాదు, సింగిల్ పర్సన్ మరణించిన తర్వాత పరిహారం చెల్లించే సమయంలోగా)
👉 ఈ సంవత్సరం మరణించిన వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలి.
👉 అదే విధంగా కొత్త రైస్ కార్డు లో కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు ఒకరిని బీమా లో నమోదు చేయించాలి, బయోమెట్రిక్ తప్పకుండా తీసుకోవలెను.