YSR Cheyutha Scheme 2023
YSR Cheyutha Scheme కు సంబంధించి 45-60 సంవత్సరంలో మధ్య వయసు ఉన్న ఎస్. సి./ ఎస్. బి./ బి. సి./ మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత కొరకు సంవత్సరానికి రూ.18,750/- చొప్పున నాలుగు సంవత్సరాలలో ఒక్కొక్కరికి 75,000/- లు వై.ఎస్.ఆర్ చేయూత పథకం ద్వారా హార్దిక సహాయం అందించబడుతుంది.
♻️ 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :: వైఎస్‌ఆర్ చేయూత పథకం 2023 అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు అప్లై చేసుకొని సిద్దంగా ఉంచుకోండి.
YSR Cheyutha Scheme StatusClick
YSR Cheyutha Scheme 2023 Latest UpdatesClickVideo
YSR Cheyutha New ApplicationClick
అర్హతలు:
మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ .10,000 మరియు పట్టణ ప్రాంతంలో అయితే రూ. 12,000 కంటే తక్కువ ఉండాలి.
మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
కుటుంబం నివసిస్తున్న గృహం( సొంతం/ అద్దె) యొక్క నెలవారి విద్యుత్ వినియోగం బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ ఉండవలెను).
పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి.
ప్రభుత్వం జారీ చేసిన సమగ్రా కుల ధ్రువీకరణ పత్రం(S.C.,S.T.,B.C.,Minority)కలిగి ఉండవలెను .
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుతో పాటు స్వయంగ గ్రామ/ వార్డు సచివాలయాల్లో కానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR(Your Service Request – మీ సేవ అ అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేసిన నా లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియ అన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి రూ.18,750/- ప్రభుత్వము చేత అందించబడును.
YSR Cheyutha All Updates 2023
Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.