YSR Kalyanamasthu Shadi Thofa Scheme యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఈ పేజీలో అందిస్తాను. పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ వివరాలు కళ్యాణమస్తు లేదా షాదీ తోప ఎలా అప్లై చేయాలి ఏంటి, అప్లై చేసుకున్న లబ్ధిదారులకి కావలసిన డాక్యుమెంట్స్, ఏ కాస్ట్ వారికి ఎంత నగదీస్తారు పూర్తి వివరాలు అందిస్తాను.
* ఈ రోజు 29 న వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా పథకం (YSR Kalyanamasthu Shadi Thofa Scheme) 4వ విడత అమౌంట్ తల్లి ఖాతాలో జమ చేయబడుతుంది అని ప్రభుత్వం సమాచారం ఇచ్చినది.
* దూదేకుల , నూర్ , బాషా , పింజలి, లదాఫ్ ముస్లిం లకు కూడా ఈ ysr షాదీ తోఫా వర్తిస్తుందని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా వచ్చిన మాచారం ప్రకారం 50 వేల రూ నుండి లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్టు నిర్ణయించింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెళ్ళికానున్న ప్రతి ఒక్క వధువుకు పెళ్లి కానుక క్రింద వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వైయస్సార్ షాదీ తోఫ ద్వారా నగదును అందించాలని నిర్ణయించారు. ముస్లిం మైనార్టీ వారికి షాదీ తోఫా మరియు sc/st/bc మైనార్టీ వారికి వైయస్సార్ కళ్యాణమస్తు కానుక అందిస్తారు.
* కొత్త దరఖాస్తు కు అప్లికేషన్ – ᴄʟɪᴄᴋ ʜᴇʀᴇ
1. అందించు నగదు ?
2. ఇంటర్ క్యాస్ట్ అంటే ?
* మైనార్టీ ఇంటర్ క్యాస్ట్ అంటే మహిళా మైనార్టీ కులానికి చెంది ఉంది పురుషుడు మైనారిటీ కులానికి చెంది ఉండరాదు.
* బీసీ ఇంటర్ క్యాస్ట్ అంటే మహిళా బీసీ కులానికి చెంది ఉండి పురుషుడు బీసీ కులానికి చెంది ఉండరాదు.
* ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ అంటే మహిళ ఎస్సి కులానికి చెంది ఉండి పురుషుడు ఎస్సీ కులానికి చెంది ఉండరాదు.
* ఎస్టి ఇంటర్ క్యాస్ట్ అంటే మహిళ ఎస్టి కులానికి చెంది ఉండి పురుషుడు ఎస్టి కులానికి చెంది ఉండరాదు .
2.1 వికలాంగులకు ఈ పథకం ఎలా వర్తిస్తుంది ?
పురుషుడు వికలాంగుడు అయ్యి ఉండి మహిళ వికలాంగురాలు కాకపోయినా పర్వాలేదు . మహిళా వికలాంగురాల అయ్యుండి పురుషుడు వికలాంగుడు అయి ఉండకపోయినా ఈ పథకం మహిళకు వర్తిస్తుంది.
3. నగదు బ్యాంకులో ఏ తేదీన పడుతుంది ?
ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు అందరికీ ప్రతి సంవత్సరం నాలుగు నెలల లో ఏదో ఒక నెల జమ చేయబడుతుంది.
ఆ నెల ఫిబ్రవరి , మే, ఆగస్టు మరియు నవంబర్ లో లబ్ధిదారులకు వెరిఫికేషన్ అయినట్లయితే పైన ఇవ్వబడిన నెలలో నగదు జమ చేయబడుతుంది. ఉదాహరణకు లబ్ధిదారుని వెరిఫికేషన్ ఆగస్టులో అయినట్లయితే వారికి నగదు సెప్టెంబర్ లో జమవుతుంది.
4. పూర్తి అర్హతలు :
1 : వయస్సు పరిమితిపెళ్లయిన తేదీ నాటికి పెళ్ళికొడుకు వయసు 21 సంవత్సరాలు మరియు పెళ్లికూతురు వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి .
2 : మొదటి పెళ్లికి మాత్రమేమొదటి పెళ్లికి మాత్రమే కేవలం ఈ పథకం వర్తిస్తుంది. ఓకే ఇంట్లో ఇద్దరు వితంతువులు ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. వితంతువు అర్హులు.
3 : విద్య పెళ్లికూతురు అయినా పెళ్లి కొడుకు అయినా పదో తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
4. అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకొను విధానం : పేజీ చివరి ఉంది చూడండి.
5 : పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు యొక్క ఆదాయ పరిమితులు
- * కుటుంబ ఆదాయం పట్టణాల్లో అయితే 12,000 రు మించకూడదు. గ్రామాలలో ఐతే 10,000 మించరాదు.
- * మునిసిపాలిటీ ఆస్థి 1000 చదరపు అడుగులు మించరాదు.
- * కరెంట్ బిల్లు గత 12 నెలలు తీసుకువడం జరుగుతుంది.కాబట్టి 300 యూనిట్లు మించరాదు.
- * టాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహాయించి కుటుంబం లో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.
- * ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండ రాదు . పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు.
- * కుటుంబం మొత్తానికి మెట్ట భూమి 3 ఎకరాలు పల్లపు భూమి 7 ఎకరాలు మొత్తం కలిపి 10 ఎకరాలకు మించి ఉండ రాదు.
6. కొత్త అప్లికేషన్ అయితే దీనికి రెండు విధాలుగ అప్లై చేయవచ్చు. ఆన్లైన్ లో ఆఫీసియల్ వెబ్సైటు ని ఉపయోగించుకోవచ్చు.లేదా గ్రామ సచివాలయం లో అప్లై చేసుకోవచ్చు. పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క అప్లికేషన్ కు కావల్సిన వివరాలు
- 1. ఆధార్ నెంబర్
- 2. లింగము
- 3. మొబైల్ నంబర్
- 4. ఇమెయిల్ id
- 5. date of birth సర్టిఫికేట్
- 6. క్యాస్ట్ సర్టిఫికెట్
- 7.మతము
- 8. 10 th క్లాస్ మర్క్స్ లిస్ట్
- 9. కార్మికుల కార్డ్ నంబర్
- 10. తల్లి లేదా తండ్రి లేదా సంరక్షుకూరాల యొక్క పేరు, ఆధార్ నంబర్ మరియు చిరునామా.
7. కొత్తగా దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్
- 1 : వివాహ ధ్రువీకరణ పత్రము.
- 2 : పెళ్లి కార్డు ఫోటోలు
- 3 : క్యాస్ట్ సర్టిఫికెట్
- 4 : పెళ్ళికొడుకు మరియు పెళ్లి కూతురు తో kyc చేయబడును.
- 5 : వికలాంగులు అయితే సర్టిఫికెట్ ఉండాలి.
8. ఈ కళ్యాణమస్తు & షాది తోఫా ఎప్పుడు అప్లై చేసుకోవాలి?
పెళ్లయిన 30 రోజుల్లోపు దరఖాస్తుదారులు అప్లై చేసుకోవాలి..
9. అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకొను విధానం
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి (Shadi Thofa Payment Status) అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ వివరాలు తెలుసుకోగలరు.
Step 1 :: మీరు ఫస్ట్ అఫ్ ఆల్ లింకు క్లిక్ చేయగానే విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: వచ్చిన తర్వాత మీరు షాది తోఫా సెలెక్ట్ చేసుకుని అలాగే ఇయర్ మరియు బెనిఫిసిరి యొక్క ఆధార్ నెంబర్ ఈ క్రింద చెప్పిన విధంగా అన్ని డీటెయిల్స్ ఇవ్వండి.
Step 3 :: పైన చెప్పిన విధంగా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయగానే గెట్ ఓటిపి మీద క్లిక్ చేస్తాననే మీకు లింక్ ఇన మొబైల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది.
Step 4 :: ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే క్రింది విధంగా లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి.
Step 5 :: ఫైనల్ గా లబ్ధిదారుల యొక్క Shadi Thofa Payment Status అప్లికేషన్ డీటెయిల్స్ & అలాగే పేమెంట్ స్టేటస్ మీ అప్లికేషన్ పెండింగ్లో ఉందా అప్రూవ్ అయ్యిందా ఒకవేళ అప్రూవ్ అయితే ఏ బ్యాంకులో మీకు డబ్బులు క్రెడిట్ అయింది.. రాకపోతే ఎందుకు మీకు ఫెయిల్యూర్ అయింది పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
YSR Kalyanamasthu Shadi Thofa Scheme 2024 Status & Payment Status
ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని మీ వైయస్సార్ కళ్యాణమస్తు లేదా షాది తొఫా పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ డీటెయిల్స్ తెలుసుకునగలరు. 👇👇
గమనిక :: పైన పేజీలో మీకు సంబంధించిన ప్రతి ఒక్క డీటైల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ లేకపోతే పైనున్న వాట్సప్ గ్రూపులో జాయిన్ అయి నాకు మెసేజ్ చేయగలరు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.