గతేడాది ఖరీఫ్ లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసి ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణంతో దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కాస్త ఆలస్యంగా ముందుకొచ్చింది. వీటిని వచ్చే నెల 8వ తేదీన కర్షకుల ఖాతాల్లోజమ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
🏞👩🌾 ఫ్రెండ్స్ ఈ పేజీలో నేను మీకు ఉచిత పంటల బీమా YSR Uchita Pantala Bheema Scheme కు సంబంధించి మరియు ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ పంటల బీమా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది.
⸙⸙ //ఈ క్రాప్ స్టేటస్ 2023// : ☛ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు మొదలగునవి) ప్రభుత్వం కొనాలన్నా లేదా రైతులు వేసిన పంటల తాలూకా నష్టాలు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మరియు పంటల బీమా పతకము తదితర పథకాలలో లబ్ధి పొందుటకు ఈ క్రాప్ నమోదు తప్పైని సరిగా చేయించుకుని వుండవలెను. ☛ ఈ క్రాప్ నమోదు కొరకు మీకు సంబంధించిన రైతుభరోసా కేంద్రాలలో సంప్రదించగలరు. ఈ పంట [ ecrop ] లో నమోదు చేసుకున్న వారికి వారికే ఈ సారి ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాల వారీగా పంటల బీమా
పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసుకొని మీ జిల్లాల వారీగా స్టేటస్ చెక్ చేసుకోండి .
క్రాప్ బుకింగ్ స్టేటస్
🏞👩🌾 ఖరీఫ్ 2023 సీజన్ కి సంబంధించి మీరు వేసిన పంట ఈ క్రాప్ ఆన్లైన్ అయిందో లేదో తెలుసుకోండి.👇👇
Note: మీకు ఈ పంటల బీమా పడాలంటే కచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ పని చేపించుకొని ఉండాలి. అలా చేయించుకుంటేనే అమౌంట్ అని పడుతుంది .
పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసుకొని మీ పంట కు సంబంధించి Aadhar Number, ఖాతా నెంబరు, లేదా సర్వే నెంబర్ తో ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోండి.
🫵 గమనిక :: ఉచిత పంటల బీమా డబ్బులు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే క్రింది లింక్ ని క్లిక్ చేసి ఉచిత పంటల బీమా స్టేటస్ పూర్తి వివరాలు తెలుసుకోండి. 👇👇
🙋 పైనున్న లింక్ ని క్లిక్ చేసుకొని ఉచిత పంటల బీమా కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎలా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి తెలుసుకోండి.
2022 ఖరీఫ్ 2022-23 రబీ కాలానికి సంబంధించిన బీమా చెక్ చేయండి
VAA/VHA/VSA ::
CROP INSURANCE UPDATE ::
ఖరీఫు 2023. పంటల బీమా పరిహారానికి సంబంధించిన జాబితాలను rbudp. ద్వారా VAA. లాగిన్ ల ద్వారా సోషల్ ఆడిట్ కొరకు పంపడం జరిగింది
సంబంధిత ఆర్బీకే లలో లబ్దిదారుల జాబితాల ప్రదర్శను పరిశీలించే నిమిత్తమై YSRAPP. ద్వారా 10-04-2023.వ తేదీన టాస్క్ క్రియేట్ చేయడం కూడా జరిగింది.
యూజర్ మానువల్ మరియు డెమో వీడియో మరియొకసారి జతపరచడమైనది
ఈ లిస్టులు డౌన్లోడ్ చేసుకోవడానికి , వివరములు చూడడానికి మొబైల్ కాకుండా డెస్క్ టాప్ కంప్యూటర్ వాడుతున్నట్లుగా అందువలన అమౌంట్ సరిగా డిస్ప్లే కాకపోవడం లిస్ట్ డౌన్లోడ్ కాకపోవడం వంటి ఫిర్యాదులు ఈ కార్యాలయం దృష్టికి వచ్చింది. కావున పంటల బీమా జాబితా సంబంధిత పనులకు కంప్యూటర్ వాడమని కోరడమైనది.
ఏమైనా డేటా లోడ్ కాని సందర్భములో కంప్యూటర్ లోని షిఫ్ట్+F5. బటన్సు ఏకకాలంలో వాడడం ద్వారా డేటా రిఫ్రెష్ కాబడుతుంది.
కావున VAA.ల లాగిన్లలో పొందుపరచిన జాబితాను తప్పని సరిగా డౌన్లోడ్ (ప్రింట్) చేసుకొని జాబితాలను ప్రదర్శించి ఈరోజు సాయంత్రం లోగా YSRAPP. లో అప్డేట్ చేయవలసినది గా ఆదేశించడమైనది.
(వ్యవసాయ ప్రత్యేక కమీషనర్ వారి ఆదేశముల మేరకు)
YSR Uchita Pantala Bheema Scheme అంటే ఏమిటి ?
ఈ వైయస్సార్ పంటల బీమా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2020 ఖరీఫ్ సీజన్లో రైతులకు అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. ఇలా అన్ని జిల్లాల రైతులకు జరిగిన పంట నష్టానికి కారణంగా వైయస్సార్ పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా 15.15 లక్షల మంది రైతన్నలకు 1,820. 23 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితన క్యాంప్ ఆఫీస్ నుంచి అమౌంట్ రిలీజ్ చేశారు.
వైయస్సార్ పంటల బీమా పథకానికి ఎవరు అర్హులు:
గత సంవత్సరం అనగా 2022 ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట నష్టం బీమా కు సంబంధించి ఈ క్రాఫ్ట్ బుకింగ్ పంట చేపించుకున్న రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. సో బుకింగ్ అనేది గ్రామ/ వార్డు సచివాలయం కి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ బుకింగ్ చేస్తారు. ఆ టైంలో లో ఏ రైతులు అయితే పంట ఆన్లైన్లో లో ఈ క్రాఫ్ట్ చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పంట నష్టం భీమా అనేది లభిస్తుంది. ఆరోజు ఏ రైతులు అయితే పంట ఆన్లైన్లో రైతు బీమా చేపించుకొని ఉంటారో వారందరికీ ఈ సంవత్సరం అమౌంట్ పడుతుంది.
ఇప్పుడు క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు అర్హుల :
చాలా మంది రైతులు ఈ సంవత్సరం మేము ఈ క్రాప్ బుకింగ్ చేపించు కుంటున్నాను అని అంటున్నారు.కానీ సంవత్సరం చేయించుకున్న వారు ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు .2022 గత సంవత్సరంలో ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ ఉంటారు ఆ రైతులు మాత్రమే అర్హులు.
మళ్లీ ఈ క్రాప్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది:
2023 సంవత్సరానికి సంబంధించి రైతులకు ఎప్పుడైతే మొదలు పెడతారు ఆ టైంలో గ్రామ వార్డు సచివాలయంలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ క్రాప్ బుకింగ్ అనేది సర్వే చేయడం జరుగుతుంది.ఈ బుకింగ్ వాళ్ల రైతులకి తమ పండించే పంట సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ కూడా కొనుక్కుంటుంది. అలాగే నష్టపరిహారం ఏమైనా జరిగితే కచ్చితంగా గవర్నమెంట్ నుంచి బీమా పరిహారం కూడా పొందవచ్చు. అలాగే చేయించుకోవడం వల్ల వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో నుండిపంట కొనుగోలు వరకురైతన్నలకు అందించడంతో పాటు, గ్రామంలోని సాగుచేసిన పంట వివరాలు ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తాడు.
ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం రైతన్నలకు అందించిన సహాయం:
మొదటగా చూస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతులకు 13500 పెట్టుబడి సాయంగా ప్రతి ఒక సంవత్సరం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
రెండవ పథకం వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. ఈ పథకం తో గత ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు రైతులు తమకు కావాల్సిన పెట్టుబడి సాయం నేరుగా బ్యాంకు నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకంలో రైతులు బ్యాంకు వారికి వడ్డీ చెల్లిస్తే ఆ చెల్లించిన వడ్డీ మొత్తం తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయడం జరుగుతుంది.
మూడో పథకం వైయస్సార్ ఉచిత పంటల బీమా ఈ పథకం ద్వారా రైతులు తమ పంట ఎక్కడైతే నష్టపోతారు నష్టపోయిన పరిహారానికి తిరిగి మరల రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్ వైయస్సార్ ఉచిత పంటల బీమా అని అంటారు. ఈరోజు ప్రజలందరికీ ఈ పథకం ద్వారా నేరుగా వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది.
నాలుగోవ పథకం దాన్యం కొనుగోలు ఇందులో వచ్చేసి రైతులు పండించిన పంటలను ఇక్రా బుకింగ్ చేయించుకోవడం వలన మరలా గవర్నమెంట్ రైతులు పండించిన ధాన్యాన్ని తిరిగి కొనుక్కుంటుంది.
ఐదవ పథకం ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఈ పథకం ద్వారా అందరికీ ఉచితంగా వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ను సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్ మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది. అలాగే పగటిపూట 9 గంటల కరెంటు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఆరవ పథకం శనగ రైతులకు బోసన్ ఈ పథకం ద్వారా శనగ పంట సంబంధించి రైతులకు నష్ట పరిహారం ఉంటుందో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం బోసన్ రూపంలో 300 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.
Note : ఫ్రెండ్స్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వాలంటీర్ గా ఉంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక అప్డేట్ ఈ పేజీ ద్వారా మీ అందరికీ అందించడం కోసం ఈ వెబ్ సైట్ ను క్రియేట్ చేయడం జరిగింది. ప్రతిరోజు మీరు అప్డేట్ పొందాలనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే వెంటనే కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను మీతో కాంటాక్ట్ అవుతాను. పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.