YSR Vahana Mitra Scheme ద్వారా ఆటో, ట్యాక్సీ, మరియు మ్యాక్సీ-క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రు.10,000/- భీమ, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మత్తుల మొదలైనవాటికి ఖర్చుల నిమిత్తం వాహన మిత్ర పథకం ద్వారా ఆర్దిక సహాయం.
వాహనమిత్ర కి కావాల్సిన డాక్యుమెంట్లు ?
వైయస్సార్ వాహన మిత్రుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు కచ్చితంగా క్రింద ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.
- RC బుక్ జిరాక్స్
- డ్రైవింగ్ లైసెన్స్
- కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
- బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్
YSR వాహన మిత్ర న్యూ Appalication :: Click Here
YSR Vahana Mitra Scheme, GO, Apps User Manuals
అర్హతలు :
దరఖాస్తుదారుడు యాజమాన్యంలోనీ ఆటో, టాక్సీ, మరియు మ్యాచ్ – క్యాబ్ డ్రైవర్ అయి ఉండవలెను.
ఆటోరిక్షా / లైట్ మోటర్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఆటోరిక్షా/ టాక్సీ , మరియు మ్యాక్సీ- క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఎల్లి క్యాబ్ విషయంలో పన్ను పంటి చెల్లుబాటు అయ్యే రికార్డులు కలిగి ఉండాలి.
ఈ పథకం , ప్యాసింజర్ ఆటోరిక్షా / టాక్సీ, మరియు మ్యాక్సీ- క్యాబ్ యజమానులకు కు వర్తిస్తుంది త్రీ వీలర్ / ఫోర్ వీలర్ లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పథకం క్రింద అర్హులు కారు.
ప్రతి దరఖాస్తుదారుడి కి ఆధార్ కార్డ్ ఉండాలి.
యజమాని తప్పనిసరిగా బియ్యం కార్డు( బిపిఎల్ /వైట్ రేషన్ కార్డు /అన్నపూర్ణ కార్డు అంత్యోదయ కార్డు ) కలిగి ఉండాలి.
కుటుంబం అంటే భర్త భార్య మరియు మైనర్ పిల్లలు. కుటుంబంలో ఒక వాహనానికి( ఆటోరిక్షా /టాక్సీ మరియు మ్యాక్సీ- క్యాబ్) మాత్రమే ఈ పథకం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులు.
ఓకే బియ్యం /వైట్ రేషన్ కార్డులో వేర్వేరు వ్యక్తుల పై యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. ఏదేమైనా ఓకే బియ్యం /వైట్ రేషన్ కార్డు లో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సహాయం కోసం అర్హులు.
లబ్ధిదారుడు తండ్రి/ తల్లి /కుమారై/ సోదరుడు మరియు డ్రైవింగ్ లైసెన్స్ మేజర్ కుమారుడు/ కుమార్ పేరిట ఉంటే, వాహనం యొక్క రిజిస్టర్ యజమాని అయిన తండ్రి /తల్లి /కుమారై/ సోదరుడు ప్రయోజనం పొందడానికి అర్హులు, వారి పేర్లు వేరు వేరు బియ్యం కార్డు వైట్ రేషన్ కార్డులో ఉన్నప్పటికీ అర్హులు.
ఇతర రాష్ట్రాల జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నా లబ్ధిదారులు సంబంధిత ఆర్. టి. ఓ కార్యాలయంలో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమయంలో వాహనం, యజమాని వద్ద ఉండాలి.
కొత్త లబ్ధిదారుల దరఖాస్తులను గ్రామ వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు.
బ్యాంకు ఖాతా వాహనం యజమాని పేరు మీద ఉండాలి. లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా షెడ్యూల్ బ్యాంక్ ఏదైనా ఒకటి కావచ్చు. బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ నకలను సమర్పించాలి.
ఎస్సీ/ ఎస్టీ /బిసి/ మైనారిటీ కమ్యూనిటీ విషయంలో కుల ధ్రువీకరణ పత్రము ఉన్నచో దరఖాస్తు తో జత పరచవలెను.
వాహనం భార్య పేరిట ( డ్రైవింగ్ లైసెన్స్ కలిగి లేదు) ఉండి నడుపుతుంటే భర్తకు ( డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచో) అలాంటి దరఖాస్తుదారులను కూడా అర్హులుగా పరిగణిస్తారు.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము :
YSR Vahana Mitra Scheme కి కొత్త లబ్ధిదారులు గ్రామ /వార్డు వాలంటీర్ల నుండి దరఖాస్తులను పొందవచ్చును లేదా WWW.navasakam.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తును గ్రామ/ వార్డు వాలంటీర్ల వద్ద దాఖలు చేయవచ్చు.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR(Your Service Request-మీ సేవల అభ్యర్థన ) నెంబర్ ఇవ్వబడినది.
దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి ఒకసారి రూ. 10,000/- మంజూరు చేసి వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి చేకూర్చే పడుతోంది .