pm vishwakarma yojana in telugu – Vishwakarma Yojana Scheme 2024

Join Now


pm vishwakarma yojana in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

pm vishwakarma yojana in telugu

సంప్రదాయంగా వస్తున్న చేతి వృత్తి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం అందించేలా ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా 18 రకాల వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. హస్త కళాకారులు మరియు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేశారు. 13 వేల కోట్ల రూపాయలతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చెందుతుంది.

1.pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర్మ యోజన అంటే ఏమిటి ?

సంప్రదాయ పనులు చేసేవారికి ఈ పథకం ద్వారా వారికి సొంతంగా జీవనోపాధి పొందడానికి అవసరమైన ఆర్థిక సహాయం మరియు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో చాలామంది ప్రజలు తమ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. తమ వృత్తి పట్ల నైపుణ్యం కలవారు ఈ విశ్వకర్మ యోజన ద్వారా ప్రయోజనం పొందవచ్చు అంతేకాకుండా ఈ పథకం ద్వారా సులభంగా లోన్ పొందవచ్చు.ఇటీవల కాలంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ విశ్వకర్మ యోజనను ప్రారంభించారు.మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ట్రాన్స్ జెండర్లు, ఇతర వెనుకబడిన వర్గాలకు విశ్వకర్మ యోజన ఉపయోగపడుతుంది.

నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరియు ఇతర మంత్రుల ద్వారా క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదం అయింది.

2.pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర్మ యోజన యొక్క ప్రయోజనాలు

  • మొదటి దశలో 5 % వడ్డీ రేటు తో 1,00,000 రూపాయల వరకు రుణం ఇవ్వబడుతుంది.
  • రెండవ దశలో 5% శాతం వడ్డీతో 2,00,000 లక్షల రూపాయల వరకు రుణ ఇవ్వబడుతుంది.
  • అడ్వాన్స్ టూల్స్ కొనుగోళ్లకు 15,000 రూ ఇవ్వబడుతుంది.
  • Pm విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు గుర్తింపు కార్డు ఇస్తారు.
  • తప్పనిసరిగా నైపుణ్య అవ్వడం జరుగుతుంది.
  • నైపుణ్య శిక్షణ సమయంలో రోజుకు 500 రూ స్టైఫండ్ అందిచబడుతుంది.

3.pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర్మ యోజన యొక్క అర్హతలు

  • చేపల వలలు కుట్టేవాళ్ళు
  • చెప్పులు కుట్టేవాళ్ళుు
  • వడ్రంగి
  • కమ్మరి
  • తాళం వేసేవాడు
  • బార్బర్
  • శిల్పి
  • టైలర్లు
  • మేస్త్రి
  • పడవల తయారీదారులు
  • కుండల తయారీదారు
  • చాకలి వాళ్లు
  • స్వర్ణకారులు
  • పువ్వులు దండలు తయారు. తదితర వారు
4. pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర్మ యోజనకు అవసరమైన పత్రాలు

పీఎం విశ్వకర్మ యోజన కు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ క్రింది తెలిపిన పత్రాలు అవసరమవుతాయి.

  • దరఖాస్తుదారని ఆధార్ కార్డు
  • ఓటర్ గుర్తింపు కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • మొబైల్ నెంబర్
  • బ్యాంకు పాస్ బుక్
  • వృత్తి పత్రము . మొదలైనవి
5.pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర్మయోజనకు ఎలా దరఖాస్తు చెయ్యాలి

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 బడ్జెట్ సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గా పిలవబడే పీఎం విశ్వకర్మ కౌశల్ సమాన్ యోజన ఆగస్టు 16 2023న కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోదం పొందింది. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భం భారతదేశమంతటా ఈ పథకం అమలు లాంచ్ చేశారు. పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏదైనా Online సెంటర్ లేదా CSC LOGIN లో అప్లయ్ చేసుకోవచ్చు.

6.5.pm vishwakarma yojana in telugu / Pm విశ్వకర యోజన యొక్క లక్షణాలు
  • ఈ పథకం ద్వారా కళాకారులకు మరియు హస్త కళాకారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు గుర్తింపు కార్డు అందించబడుతుంది. అంతేకాకుండా మొదటి విడతగా ఒక లక్ష రూపాయలు రెండవ విడతగా రెండు లక్షల రూపాయలు ఐదు శాతం రాయితీగా రుణం ఇవ్వబడుతుంది.
  • దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా హస్త కళాకారులను ఏకీకృతం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. తద్వారా హస్త కళాకారుల యొక్క వృద్ధి మెరుగుపడుతుంది.
  • ఈ పథకం ద్వారా 18 రకాల వృత్తుల వారికి గ్రామాలలోనూ పట్టణాలలోనూ ఉండడం ద్వారా ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందుతారు.
  • 2023-2024 నుండి 2027- 2028 వరకు విశ్వకర్మ యోజన ద్వారా 13,000 కోట్ల నుండి 15,000 కోట్ల వరకు బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాకుండా నైపుణ్య శిక్షణ కోసం రోజుకు 500 మరియు పరికరాలు కొనుగోలు కు 15,000 రూ అందించనుంది.
  • ఈ పథకం పూర్తిగా అమలు కావడానికి ఆయా రాష్ట్రం కూడా మద్దతు అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది ఈ పథకం ద్వారా అనేకమంది హస్త కళాకారులు లాభం పొందుతారు

PM Vishwakrma Yojana Apply Link :: Click here

Pm Vishwakrma Yojana Apply Process

ఈ క్రింద ఇచ్చిన వీడియోని పూర్తిగా చూసి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

PM Vishwakrma Yojana Scheme Demo Video

ఈ క్రింద ఇచ్చినటువంటి వీడియో చూసి మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి.

గమనిక :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now