CM YS Jagan Released YSRCP Manifesto – 2024
CM YS Jagan Released YSRCP Manifesto. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ జగన్ ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలను సంక్షిప్తంగా మీడియా లైవ్ లో జగన్ ప్రజలకు వివరించారు.
The 9 Promises In YSRCP Manifesto
CM YS Jagan Released YSRCP Manifesto.
వైయస్సార్సీపి 2024 మేనిఫెస్టోకు సంబంధించి ఈ 9 హామీలను ప్రధానంగా చెప్పడం జరిగింది.
- పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు.
- వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు.
- అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని హామీ.
- వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు.
- వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి.
- ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో)వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.
- వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.
- వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా కొనసాగింపు. లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది.
- వాహన మిత్ర, మత్సకార భరోసా కొనసాగుతాయి.
అదనపు హామీలు
CM YS Jagan Released YSRCP Manifesto.
- అర్హులైన పేదలకు ఇళ్లులేని వారికి ఇళ్లు, ఇంటి స్థలం కొనసాగింపు.
- తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ.
- 175 స్కిల్ హబ్ లతో యువతకు ఉపాధి.
ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం
CM YS Jagan Released YSRCP Manifesto.
- పోలవరం ప్రాజెక్టు.
- 17 మెడికల్ కాలేజీల నిర్మాణం.
- నిర్మాణంలో ఉన్న 4 పోర్టు లు, 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు.
- భోగాపురం ఎయిర్పోర్.
- ప్రభుత్వ బడులు, హాస్టళ్లు , అంగన్వాడీలు, ఆసుపత్రుల్లోనాడు–నేడు.
- పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం.
- భూముల రీసర్వే.
- ఆక్వా యూనివర్సిటీ లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ.
- ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్ స్టోరే జీలు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు.
- ఎడెక్స్‌ద్వారా మరిన్నిఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ మరింత ముందుకు.
- ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికీ ఐబీ సిలబస్ అమలు.
ఈ పైన చెప్పిన చెప్పినవన్నీ ఈ ఐదు సంవత్సరాల పూర్తి చేస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
Manifesto Full Pdf :- CLICK HERE
పైనున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
- Check How Many Sim Cards Linked With Your Aadhaar – 0006
- How To Download Pattadar Passbook In AP – 2024
- గేమ్స్ ఆడుతూ రోజుకు ₹200 | money earning apps telugu
- How to check pm kisan beneficiary list online 2024
- How to Check Pm Kisan Payment Status