Aadudham Andhra Full Details And Registration Process – 2023

Join Now


Picsart 23 11 28 12 38 00 925

Aadudham Andhra Full Details And Registration Process – 2023

Aadudham Andhra Full Details తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. అయితే 15 సంవత్సరాలు మరియు అంతకు మించి వయస్సు వున్న వాళ్లు ఈ ఆడుదాం ఆంధ్ర లో అడి అవకాశం కలదు. మరి దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అలాగే మరన్ని విషయాలు మీరు ఈ పేజీలో తెలుసుకోవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడినట్టు అయితే మి తోటి మిత్రులకు షేర్ చేయండి.

ఆడుదాం ఆంధ్ర ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఆడుదాం ఆంధ్ర కి మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే 1092కి కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మి దగ్గరలో ఉన్నా సచివాలయాన్ని సంప్రదించండి.

Aadudham Andhra Important Details

  • ఈ కార్యక్రమంలో ఎవరు అయితే 15 సంవత్సరాలు వయస్సు పైబడి వుంటారో వారు పాల్గొనవచ్చు.
  • ఆటగాడు ఆ గ్రామంలో/పట్టణం శాశ్వతంగ వుండవచ్చు లేదా తాత్కాలికంగా ఉండవచ్చు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొనడానికిఉద్దేశపూర్వకంగా గ్రామం/పట్టణంలోకి వచ్చివారు అనర్హులు.
  • ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కాని సచివాలయ ఉద్యోగులు కాని వాలంటర్స్ కాని పాల్గునేందుకు అనర్హులు.
  • ఈ టోర్నమెంట్ నాకౌట్ పద్దతిలో నిర్వహిస్తారు.
  • క్రీడాకారుడు గరిష్టంగా రెండు విభాగాల్లో పాల్గుణవచ్చు.
  • ఈ కార్యక్రమంలో మహిళలకు మరియు పురుషులకు వేరు వేరు గా నిర్వహిస్తారు.
  • మీకు రేగస్ట్రేషన్లో ఎటువంటి సమాధ్యలు ఎదురుయినా 8977611399 నంబరకు కాల్ చెయ్యండి.

Aadudham Andhra Online Registration Process

1. కిందా వున్న లింక్ క్లిక్ చేసుకుని ఆడుదాం ఆంధ్ర అధికారిక వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

IMG 20231127 124338

2. తర్వాత Register Now ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20231127 124351 1

3. Register As Player అనే ఆప్షన్ పైన క్లిక్ చేసీ. మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి. User Consent పైన టిక్ మార్క్ చేసీ. Accept పైన క్లిక్ చెయ్యాలి.

IMG 20231127 124436 1

4. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి Get Otp పైన క్లిక్ చెయ్యండి.

IMG 20231127 124450

5. ఇన్ఫో పేజీ ఓపెన్ అవుతుంది ఓకే పైన క్లిక్ చేసి. OTP ఎంటర్ చెయ్యండి. తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20231127 124517 1

6. Competitive Gamesలొ ఒకటో లేదా రెండు సెలెక్ట్ చేసుకుని Non Competitive లో మీకు నచ్చిన గేమ్స్ సెలెక్ట్ చేసుకోండి.

IMG 20231127 124602

7. తర్వాత మీ వాలంటీర్ వద్ద వున్న హౌస్ మాపింగ్ మరియు ఆధార్ ప్రకారం మి వివరాలు వస్తాయి. ఒకవేళ రానట్టు అయితే మీరే ఎంటర్ చెయ్యాలి. అక్కడ మీ సచివాలయం పేరు సచివాలయం పిన్ కోడ్ అలాగే వాలంటీట్ పేరు, వాలంటర్ మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.

IMG 20231127 124549

8. తర్వాత చిరునామా రుజువు పత్రాన్ని సెలెక్ట్ చేసుకుని. డాక్యుమెంట్ అప్లోడ్ చెయ్యాలి. తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చెయ్యాలి.

9. తర్వాత ప్లేయర్ రిజిస్ట్రేషన్ కార్డ్ వస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

గమనిక:- మీరు ప్లేయర్ గా కాకుండా ఆడియన్స్ గా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మొదట రిజిస్టెట్ ఎస్ ప్లేయర్ గా కాకుండా రిజిస్టర్ ఎస్ ఆడియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పైన చెప్పిన విధంగానే రిజిస్టర్ అవ్వాలి.

Aadudham Andhra Team Selection Process

1. ఆన్లైన్ లో మీ టీంను సెలెక్ట్ చేసుకోడానికి పైన చెప్పినట్లు ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాలి. అలాగే మి టీంలో ఎంత మంది ఆడదాం అనుకుంటున్నారో వారు అందరు ఎవరికి వారు ఆన్లైన్లొ రిజిస్టర్ అవ్వాలి.

2. అందులో ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి తరువాత My Team అని ఆప్షన్ను ఎంపిక చేసుకోగానే ఆ గ్రామ సచివాలయం పరిధి లో ఆ ఆట కు. సంబంధించి రిజిస్టర్ అయిన ప్లేయర్ల అంతమంది కనిపిస్తారు.

3. అక్కడ కనిపిస్తున్న పేర్ల నుండి మీ టీం లో చేర్చుకోవలసిన వారి పేర్లను ఒక్కొక్కరుగా ఎంపిక చేసుకోవాలి, ముందుగా ఒక ప్లేయర్ను ఎంపిక చేసుకోగానే ఆ ప్లేయర్ ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యున్నారో అ మొబైల్ నెంబర్ ను టైప్ చేసి Get OTP పై క్లిక్ చేయగానే అతని మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి. సబ్మిట్ చేయగానే అతను మీ టీం లో నమోదు అవుతారు. ఈ విధంగా మీ టీంలో అంతమంది మెంబర్లను ఎంపిక చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ టీం తదుపరి లాగిన్లకు వెళుతుంది.

Aadudham Andhra Prize Money

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు

  • నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలుగా ఉంది.
  • రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు. “
  • మూడో ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.”

బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో

  • మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
  • రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.1 లక్షగా నిర్ణయించారు.
  • మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50 వేలుగా నిర్ణయించారు.

Aadudham Andhra Question And Answer

1) ఆడుదాం ఆంధ్ర పోటీలు ఏ స్థాయిలో నిర్వహిస్తారు?

𝐀𝐍𝐒: గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తారు.

2) ఏ ఏ క్రీడలకు పోటీలు కలవు?

𝐀𝐍𝐒: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్.

3) పోటీలు పురుషులకు మాత్రమేనా?

𝐀𝐍𝐒: అన్ని క్రీడలలోనూ స్త్రీలకు కూడా ప్రవేశం కలదు.

4) Registration ఎక్కడ చేసుకొవాలి?

𝐀𝐍𝐒: కింద ఉన్న link ద్వార కానీ,1902 కి phone చేసిగాని లేదా మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు.

5) Registration ఎప్పటి నుంచి మొదలవుతుంది?

𝐀𝐍𝐒: 27 నవంబర్ 2023 నుండి 13 డిసెంబర్ 2023 వరకు.

6) పోటీలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?

𝐀𝐍𝐒: గ్రామస్థాయి పోటీలు 15 డిసెంబర్ 2023 న మొదలయ్యి రాష్ట్రస్థాయి పోటీలు 24 జనవరి 2024 ముగుస్తాయి.

7) పోటీలో పాల్గొనటానికి కనీస వయసు ఎంత?

𝐀𝐍𝐒: 15 సంవత్సరములు.

8) నగదు బహుమతి ఎంత?

𝐀𝐍𝐒: నియోగికవర్గం స్థాయి:🥇1st: 20,000/-,🥈2nd: 10,000/-జిల్లా స్థాయి:🥇1st: 1,00,000/-, 🥈2nd: 50,000/-రాష్ట్ర స్థాయి:🥇1st: 5,00,000/-, 🥈2nd: 3,00,000/-

9) Registration కు కావలసినవి?

𝐀𝐍𝐒: Aadhar Card, Id card కోసం photo, mobile number.

10) ఎవరి ఊరితరుపున వారు పోటీ చేయవచ్చా లేక ఎక్కడైనా పోటీ చేయవచ్చా?

𝐀𝐍𝐒: ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసం కావచ్చు లేద తాత్కాలికంగా గ్రామం/పట్టణం లో ఉండిఉండవచ్చు లేద గ్రామంలో చదువుకోసం ఉండిఉండవచ్చు. కేవలం ఆటకోసం గ్రామానికి వస్తే అనర్హులు.

11) ప్రభుత్వ ఉద్యోగులు పోటిచేయవచ్చా?

𝐀𝐍𝐒: ప్రభుత్వ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు ప్రవేశం లేదు.

Registration Link :- CLICK HERE

Audience Registration Guide :- CLICK HERE

Aadudham Andhra Registration Apply Process (Demo Video) :- Click Here

Aadudham Andhra Full Details And Registration Process – 2023

ఆడుదాం ఆంధ్రకు సంబంధించి మీకున్న అన్ని డౌట్స్ కి & రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ క్రింది యూట్యూబ్ వీడియో చూసి తెలుసుకోండి. 👇

Read More :-