కౌలు గుర్తింపు కార్డు ( CCRC ) Status CCRC Required Documents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
కౌలు గుర్తింపు కార్డు ( CCRC )

కౌలు గుర్తింపు కార్డు ( CCRC )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు సంబంధించి కౌలు గుర్తింపు కార్డు ( CCRC ) పూర్తి వివరాలు పేజీలో మీకు అందించడం జరుగుతుంది. ఈ పేజీని లాస్ట్ వరకు చూసి మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలానికి సంబంధించి పొలం కౌలుకు సాగు చేసే ప్రతి రైతు సోదరులు కూడా తప్పనిసరిగా రెవిన్యూ శాఖ వారు జారీ చేసే ” కౌలు గుర్తింపు కార్డు (CCRC)” తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ గుర్తింపు కార్డు తీసుకుంటే మాత్రమే ఈ సంవత్సరం కౌలు దారులకు పంట నమోదు చేయడానికి వీలు ఉంటుంది. పంట నమోదులో పేరు నమోదు అయితే మాత్రమే ప్రభుత్వం వారు అందించే పథకాలు భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.

వీటి అన్నిటికీ CCRC Card కలిగి ఉండాలి. ఈ కార్డుతో భూ యజమానులకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి కౌలు రైతులకు కూడా వస్తుంది. వీరికి ఈ క్రాప్ బుకింగ్ నమేదు చేసి ఈ పథకాలను వర్తింపజేస్తారు.

కౌలు గుర్తింపు కార్డు ( CCRC ) అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్

CCRC కార్డ్ అప్లై చేయాలంటే కింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కచ్చితంగా కౌలు రైతుకు ఉండాలి.

1. సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ / 18 జిరాక్స్

2. సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్

3. కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్

4. కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3

5. కౌలు కార్డ్

కౌలు గుర్తింపు కార్డు (CCRC) Apply Process

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలలో మరియు మండల వ్యవసాయ కేంద్రాలలో కౌలు గుర్తింపు కార్డు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అప్లై చేస్తున్నారు. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్లి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర సిసిఆర్సి కార్డు అప్లై చేసుకోగలరు.

CCRC కార్డు ఉపయోగాలు

కౌలు రైతులకు సిసిఆర్సి కార్డు అప్లై చేసుకోవడం వలన సొంత భూమి కలిగిన యజమానులకు కలిగే బెనిఫిట్స్ అన్ని కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.

  • కౌలు రైతులకు (BC, SC, ST, మైనారిటీ లకు మాత్రమే) వై.ఎస్.ఆర్. రైతు భరోసా రావాలన్నా ఈ CCRC CARD తప్పనిసరిగా కావలెను.
  • పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఈ కార్డ్ తప్పనిసరి.
  • పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికి.
  • ఈ CCRC CARD కలిగిన రైతులు మాత్రమే పంటల భీమా పొందటానికైనా అర్హులు.

గమనిక : పై విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత వాలంటీర్లను కానీ, VRO గారిని కానీ, రైతు భరోసా కేంద్రంలో ఉండే VAA గారిని కానీ సంప్రదించగలరు.

కౌలు గుర్తింపు కార్డు (CCRC) Status

ప్రస్తుతం సిసిఆర్సి కార్డ్ స్టేటస్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ని డిసేబుల్ చేయడం జరిగింది. మళ్లీ ఓపెన్ అవ్వగానే ఈ పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది.

ఫ్రెండ్స్ CCRC కార్డ్ గురించి సమగ్ర సమాచారం మీకు అందించడం జరిగింది. పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now