ప్రధానంగా అసంఘటిత రంగానికి సంబంధించిన కార్మికులు మరియు శ్రామికుల కోసం ఇ-శ్రమ్ కార్డ్ { E Shram Card Apply Online } ప్రవేశపెట్టబడింది. ఈ కార్డును పొందడం ద్వారా వీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద, ఇ-శ్రమ్ కార్డ్ హోల్డర్లకు రూ. 2 లక్షల రూపాయలు వరకు భీమా కవరేజీ ఇవ్వబడుతుంది. అంతే కాకుండా, ఈ ఇ-శ్రమ్ కార్డ్ ద్వారా ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇ-శ్రమ్ కార్డు ద్వారా కార్మికులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే దేశం మొత్తం మీద 18 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి.
కొత్తగా కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం కొత్త పథకాలు ముందుకు తీసుకురావడానికి వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది.
ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుండి ఆర్ధిక లబ్ది ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది.
e-SHRAM కార్డ్‌ని ఎవరు తీసుకోవాలి?
1.ట్యూటర్,
2.హౌస్ కీపర్ – పనిమనిషి
3.వంటమనిషి,
4.సఫాయి కర్మచారి,
5.గార్డ్,
6.బ్యూటీ పార్లర్ వర్కర్,
7.బార్బర్,
8.చెప్పులు కుట్టేవాడు,
9.టైలర్,
10.కార్పెంటర్,
11.ప్లంబర్,
12.ఎలక్ట్రీషియన్,
13.పెయింటర్,
14.టైల్ వర్కర్,
15.వెల్డింగ్ వర్కర్,
16.వ్యవసాయ కార్మికుడు,
17.NREGA కార్మికుడు,
18.ఇటుకల బట్టీ కార్మికుడు,
19.రాళ్ళు కొట్టేవాడు,
20.క్వారీ కార్మికుడు,
21.శిల్పి,
22.మత్స్యకారుడు,
24.రిక్షా పుల్లర్,
25.విక్రేత,
26.చాట్ వాలా,
27.భెల్ వాలా,
28.చాయ్ వాలా,
29.హోటల్ సేవకుడు/ వెయిటర్,
30.రిసెప్షనిస్ట్,
31.విచారణ గుమాస్తా (ఎంక్వయిరీ క్లర్క్),
32.ఆపరేటర్,
33.ఏదైనా దుకాణం యొక్క సేల్స్‌మ్యాన్ లేదా హెల్పర్,
34.ఆటో డ్రైవర్,
35.డ్రైవర్,
36.పంక్చర్ మేకర్,
37.షెపర్డ్,
38.డైరీ నడిపేవాడు,
39.పశుపోషకులు,
40.పేపర్ హాకర్,
41.జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్,
42.అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్
43.కొరియర్ బాయ్,
44.నర్సు,
45.వార్డ్‌బాయ్,
46.ఆయా
రిజిస్ట్రేషన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్
Aadhar card (ఆధార్ కార్డు)
Bank book (బ్యాంక్ పాస్ బుక్)
ఆధార్ కార్డుకి లింకు ఉన్న మొబైల్ నెంబర్ for OTP
రిజిస్ట్రేషన్ కోసం పైనున్న డాక్యుమెంట్స్ అన్నీ కచ్చితంగా అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకుంటే ప్రిపేర్ చేసుకుని మళ్లీ అప్లై చేసుకోండి.
E Shram Card Apply Online Link
ప్రతి ఒక్కరూ సింపుల్ గా మీరే మీ మొబైల్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకొని మీ మొబైల్ లో మీరు అప్లై చేసుకోండి.
ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని { E Shram Card Apply Online }ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో తెలుసుకోండి.
E Shram పథకంలో చేరితే కలిగే ప్రయోజనాలు :
దీనిలో పేర్లు నమోదు అయిన వారు ఈ ప్రమాదంలో చనిపోతే శాశ్వత వైకల్యం చెందితే రూ, 2 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ, 1 లక్ష ఇస్తారు.
ప్రతి ఒక్కరూ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారు అందరూ ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చును.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాలు మీకు అందుతాయి.