Gadapa Gadapa ku Mana Prabutvam Guidelines, GO, Updates

Join Now


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినందువలన తన పరిపాలన లోని ప్రజలకు సంబంధించి అన్ని విధాల బాగోగులు తెలుసుకోవడం కోసం MLA లను, మరియు ముఖ్యమైన అధికారులను Gadapa Gadapa ku Mana Prabutvam అనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మూడేళ్ల పాలన సందర్భంగా ప్రభుత్వ కార్యాచరణ

  • అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెళ్లాలి.
  • గ్రామ, వార్డు సచివాలయాలన్నింటినీ సందర్శించాలని ఆదేశం.
  • ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన.
  • ప్రజల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలి.
  • నియోజకవర్గంలో అన్ని ఇళ్లు పూర్తయ్యే వరకు కార్యక్రమం జరగాలి.
  • ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ ఉత్తర్వులు జారీ.
  • పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.

Gadapa Gadapa ku Mana Prabutvam

Gadapa Gadapa ku Mana Prabutvam Guidelines, GO, Updates

ఈ క్రింద ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొదలు పెట్టిన Gadapa Gadapa Ku Mana Prabutvam Guidelines, GO, ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు తెలుసుకోండి. 👇👇

ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి సంబంధించి గౌరవనీయులైన MLA లు మే 11 నుండి తమ అధికార పరిధిలోని గృహాలను సందర్శించే “ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.” ఈ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు G.O నెంబర్ 68, విడుదల, పైన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.

గడప గడపకు టీమ్ లో ఎవరెవరు వెళతారో తెలుసుకోండి.

  • ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలను మండల, మున్సిపాలిటీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లాలి.
  • ఈ మహాయజ్ఞం పటిష్టంగా, పక్కాగా జరిగేలా ఆయా జిల్లాల కలెక్టర్లు షెడ్యూల్‌ను రూపొందించాలి.
  • గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంచాలి.
  • ఆగడప గడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారుల సంతృప్త స్థాయిని తెలుసుకుంటారు.
  • నెలలో 10 గ్రామ, వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా షెడ్యూలను రూపొందించుకోవాలి.
  • ఒక్కో సచివాలయ పరిధిలో ఎమ్మెల్యేలు రెండ్రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, ప్రభుత్వ సేవలు అందించడం, ఆయా సంక్షేమాభివృద్ధి పథకాల అమలుతీరును సమీక్షించాలి.
    ఎమ్మెల్యేల సమీక్షలకు అవసరమైన సమాచారంతో పాటు నాడు-నేడు కింద విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన పనుల సమాచారాన్ని అధికారులు అందుబాటు లో ఉంచాలి.
  • ఎమ్మెల్యేలు గ్రామాల సందర్శన నేపథ్యంలో గత మూడేళ్లుగా ఆయా గ్రామాల్లో అమలుచేసిన పథకాలకు చెందిన వివరాలతో బుట్‌ను అందుబాటులో ఉంచాలి.
  • ఇక ఎమ్మెల్యేల ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ తమ పరిధిలోని సిబ్బందికి తగిన ఆదేశాలు జారీచేయాలి. కార్యక్రమం పూర్తయ్యే వరకు కలెక్టర్లు సమన్వయం చేయాలి.

NOTE :: ఫ్రెండ్స్ పైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవుతే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో వస్తాయి. ఈ పేజీ మీరు విజిట్ చేసినందుకు ధన్యవాదములు.

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now