YSR Pension Kanuka Scheme

Join Now


YSR Pension Kanuka Scheme

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ పెన్షన్ కు సంబంధించి పెన్షన్ కానుక స్కీమ్ ఫుల్ డీటెయిల్స్ అన్ని రకాల యాప్స్, [ YSR Pension Kanuka Scheme ] డాష్ బోర్డ్ లింకులు ఈ పేజీలో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

పెన్షన్ నగదును గ్రామ వార్డు వాలంటీర్ వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది.

వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వారికి జనవరి 2023 నెల నుంచి నగదును రూ.2500 నుంచి 2750 కు పెంచటం జరిగింది.

గమనిక :: పెన్షన్ సంబంధించి మళ్లీ ఏదైనా కొత్తగా యాప్ వచ్చిన ఈ పేజీలో ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది.

YSR Pension Kanuka All Apps

ఈ క్రింద ఇచ్చినటువంటి టేబుల్ లో వైయస్సార్ పెన్షన్ కానుక సంబంధించి పెన్షన్ అప్లికేషన్లు {YSR Pension Kaanuka All Apps} మరియు పెన్షన్ స్టేటస్ మీకు నచ్చిన టువంటి లింకును క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పొందగలరు.

S.NOPension – AppsLinks
4 YSR Pension Kanuka App 3.0v New Click
3RBIS App 2.9.6v NewClick
2Pension Dash Board NewClick
1YSR Pension Kaanuka STATUS OldClick
0 YSR Pension Kaanuka STATUS New Click

All Finger Print Devices

ఈ క్రింది టేబుల్ లో మీకు కావలసిన ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ యాప్స్ ఉన్నాయి. క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోగలరు.

S.NOFinger Print Devices Links
1ACPL FM220 Click
2Mantra RD 1.0.8 Click
3Next Biometric Click
4Aratek Click
5iris New RD Service App Click
6Aadhar Face RD App Click

YSR Pension Kanuka Scheme

అర్హతలు ::

YSR Pension Kanuka Scheme కు సంబంధించి మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ .10,000 మరియు పట్టణ ప్రాంతంలో అయితే రూ. 12,000 కంటే తక్కువ ఉండాలి.

మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు   మించరాదు.

కుటుంబం మొత్తానికి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.(అయితే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు ఉన్నవారు మినహాయింపు).

కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.

కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంతం/ అద్దె)  యొక్క నెలవారి విద్యుత్ వినియోగం బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ ఉండవలెను).

పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.

కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.

సాధారణంగా ఒక కుటుంబానికి ఒక ఫింఛను (40% మరియు ఆ పైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహా) మాత్రమే.

 

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:

  • పైన తెలిపిన అర్హతలు కలిగినవారు  దరఖాస్తులను స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయంలో  గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.
  • అర్హులైన దరఖాస్తుదారునికి  YSR(Your Service Request – మీ సేవ అ అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
  •  దరఖాస్తు చేసిన 10 రోజుల్లో అర్హులైన దరఖాస్తుదారునికి   డా. వై. ఎస్. ఆర్. పింఛను కానుక కార్డువాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది.

YSR Pension Kanuka Scheme రకములు మరియు అర్హతలు :

వితంతు పెన్షన్ : వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వికలాంగుల పెన్షన్ : 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు.

చేనేత కార్మికుల పెన్షన్ : వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

కల్లు గీత కార్మికుల పింఛన్ : వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

మత్స్యకారుల పెన్షన్ : వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ : ఈ YSR Pension Kanuka Scheme కు వయో పరిమితి లేదు. ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.
డయాలసిస్ (CKDU) పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5) వయో పరిమితి లేదు.

ట్రాన్స్ జెండర్ పెన్షన్ : 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.

ఒంటరి మహిళ పెన్షన్ : వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)

డప్పు కళాకారుల పెన్షన్ : వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.

చర్మకారుల పెన్షన్ : వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.

అభయ హస్తం పెన్షన్ : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి.  అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.

Leave a Comment